ఆరునూరైనా కేసీఆర్ ను ఓడించి తీరుతాం

తెలంగాణ యువకులు, విద్యార్థులు ఈ సీఎం మాకొద్దు అని, ఆరునూరైనా సీఎం కేసీఆర్ ను ఓడించి తీరుతామని అంటున్నారునై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి మెదక్ పట్టణంలో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ సమావేశంలో ముఖ్య అతిదిగా పాల్గొంటూ తెలంగాణ రాష్ట్రంలో సదువుకుంటే నౌకర్లు రావని, పైరవిలకే ఉద్యోగాలు వస్తాయని టీఎస్పిఎస్సి లో అక్రమాలు నిరూపించాయని పేర్కొన్నారు.
 
హుజురాబాద్ ఫలితమే రేపు తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం అవుతాయని ఆయన భరోసా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడంలేదని ధ్వజమెత్తారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించిననడు జిల్లా గర్వ పడ్డది కానీ నేడు ఛీ అనే రోజులువచ్చాయని పేర్కొన్నారు.
 
అదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఈ ముఖ్యమంత్రి మాటలకు చేతలకు పోలిక లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ను మట్టిలో కలిపేస్తామని ఈటెల తేల్చి చెప్పారు. తెలంగాణలో ఈ మూడేండ్ల లో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు.  దుబ్బాక, హుజురాబాద్ లలో కాంగ్రెస్ కు డిపాజిట్ పోయిందని విమర్శించారు.బీఆర్ఎస్ పార్టీని, జిత్తుల మారి కేసీఆర్ ను ఇంటికి పంపే సత్తా బీజేపీకే ఉందని ఈటెల స్పష్టం చేశారు. తెలంగాణలో రబీలో నోటీకాడి పంట వానలకు నేలపాలు ఆయిందని, రూ 10 వేలు ఇస్తానని ఐదు పైసలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పంజాబ్, మహారాష్ట్ర రైతులకు తెలంగాణ డబ్బులు ఇచ్చారని గుర్తు చేశారని పేర్కొంటూ తెలంగాణ కౌలు రైతులు చనిపోతే రూ 5 లక్షలు ఇచ్చే దమ్ముoదా అని రాజేందర్ ప్రశ్నించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే కౌలు రైతులు చనిపోతే రూ 5 లక్షలు ఇస్తామని ఆయన ప్రకటించారు. ధాన్యం కొనలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని దుయ్యబట్టారు.  ఎకరాకు రూ ఐదు వేల రూపాయలు ఇచ్చి ధాన్యం అమ్ముకుంటే కటింగ్ పేరుతో ఒక్కొక్కరికి రూ 5 వేలు తీసుకున్నారని విమర్శించారు.

మ్యానిఫెస్టో లో పెట్టిన రూ లక్ష రుణమాఫీ ఏమైందని ఈటెల ప్రశ్నించారు. తెలంగాణ నిరుద్యోగుల్లారా కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని పిలుపిచ్చారు. టిఎస్పిఎస్సి లో ప్రభుత్వ పెద్దల అండదండలతో పేపర్లు లీకేజీ అయిందని విచారణలో తెలినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో 200 మంది చొప్పున బెల్టుషాపులు ఉన్నాయని అంటూ  లిక్కర్ ద్వారా రూ 45 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని ఈ ప్రభుత్వం  మోసం చేసిందని విమర్శించారు. మోదీ సర్కార్ దేశంలో మూడున్నర కోట్ల ఇండ్లు కట్టించిందని గుర్తు చేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రూ 600 కోట్లు ఖర్చు చేసిండ్రు ఏమైంది? పైసలు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట దావత్ లు చేశారని విమర్శించారు. ప్రజా క్షేత్రంలో కేసీఆర్ అంతు చూస్తాం, కేసీఆర్ సర్కార్ పై కొట్లాడతానికి అంకుటిత దీక్ష తో బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.