డ్రగ్స్ కొన్నవారిలో టాలీవుడ్ సెలబ్రిటీలు!

గోవా నుండి డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో అరెస్ట్ అయినా సినీ నిర్మాత కెపి చౌదరి విచారణలో సైబరాబాద్ పోలీసులకు టాలీవుడ్ లో పలువురు సెలెబ్రెటీల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ విచారణలో భాగంగా.. 100 కొకైన్ ప్యాకెట్ల గోవా నుంచి తీసుకుని రాగా అందులో 90 ప్యాకెట్లను సీజ్ చేశారు.  అయితే మిగిలిన 10 ప్యాకెట్లను ఎవరికి అమ్మారన్నదానిపై విచారణ సాగించగా టాలీవుడ్ సెలబ్రిటీలు పేర్లు వెలుగులోకి వచ్చాయి.
మొదట తనకు డ్రగ్స్ తీసుకొనే అలవాటు ఉందంటూ, మరెవ్వరికీ సరఫరా చేయలేదని వాదించిన అతను విచారణలో 12 మందికి సరఫరా చేసిన్నట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది.  నిందితుడు కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డితో పాటు చాలామంది సెలబ్రిటీల పేర్లు ఉండటంతో అషురెడ్డిని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.
అషురెడ్డితో పాటు, నటి జ్యోతి, సురేఖావాణి ఇతర ప్రముఖ నటీమణులతో కేపీ చౌదరి సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఉండటంతో అటు వైపు నుంచి కూడా విచారణ సాగిస్తున్నారు.  కాల్ లిస్ట్‌ని డీకోడ్ చేయగ కేపీ చౌదరి-అషురెడ్డిల మధ్య వందల ఫోన్ కాల్స్ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా అషురెడ్డి కదలికలపై కూడా పోలీసులు అనూమానం వ్యక్తం చేసేట్టుగానే ఉంది. అయితే, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అషురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు.
ఆమె ఎక్కువగా విదేశాల్లోనే ఉంటారు. సినిమాలు, సీరియల్స్, ఇతర షోలు ఏమీ చేయకపోయినా అషురెడ్డి లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఎక్కువగా విదేశాల్లో షికార్లు చేస్తుంటారు.  అషురెడ్డి, జ్యోతి, సురేఖావాణిలతో కేపీ చౌదరి వందల ఫోన్ కాల్స్ మాట్లాడటంతో అటు వైపుగా విచారణ సాగిస్తున్నారు. వీరి మధ్య జరిగిన సంభాషణపై దర్యాప్తు సాగిస్తున్నారు.
వీరితో పాటు మరో ఐటమ్ బ్యూటీ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. రఘుతేజా, బెజవాడ భరత్, శ్వేత, సనా మిశ్ర ఇలా చాలామంది పేర్లు కేపీ చౌదరి కాల్‌లిస్ట్‌లో ఉండగా, వీరితో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్టు సమాచారం.  కేపీ బ్యాంకు లావాదేవీలను పోలీసులు పరిశీలించారు. దీంతో కేపీ ఖాతాలో 11 అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. మరో సెలబ్రిటీ అయిన సిక్కిరెడ్డి నివాసంలో పార్టీలు జరిపేవారని, అందులో డ్రగ్ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు.