ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవు

ఉగ్రవాదం ఇప్పటికే ప్రమాదకరంగా ఉందని  పేర్కొంటూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. అమెరికా చట్టసభ కాంగ్రెస్‌లో చారిత్రాత్మకంగా గంట పాటు ప్రసంగించిన ప్రధాని  పరోక్షంగా పాకిస్థాన్ కు హెచ్చరికలు చేశారు. ప్రపంచంలోనే భారత్ ప్రస్తుతం మూడో అతిపెద్ద ఆర్దిక వ్యవస్థగా మారుతోందని చెబుతూ 9/11 దాడులు..26/11 దాడులను ప్రధాని ప్రస్తావించారు.
 
దశాబ్దాల కాలం గడుస్తున్నా ఉగ్రవాదం ఇప్పటికీ ప్రమాదకరంగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో ఎలాంటి సందేహాలకు తావు ఉండకూడదని తేల్చి చెప్పారు. చైనా పైనా ప్రధాని మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు చేసారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై గౌరవం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించటం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించటం పైనే గ్లోబల్ ఆర్దర్ ఆధారపడి ఉందని చైనాను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.
ఇది యుద్ధాల యుగం కాదని మరోసారి చెబుతున్నానని పేర్కొంటూ రక్షణ దిగుమతుల్లో భారత్‌కు అమెరికా కీలక భాగస్వామి అని ప్రశంసించారు. తాను ప్రధానిగా తొలి సారి అమెరికాను సందర్శించిన సమయంలో భారత్..నాడు ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్దిక వ్యవస్థగా ఉండేదాని..ప్రస్తుతం 5వ స్థానంలో ఉందని చెప్పారు. త్వరలోనే మూడో స్థానానికి చేరుకుంటుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేసారు.

భారత్ పెద్దగా ఎదగడమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతోందని చెబుతూ భారత దేశం అభివృద్ధి చెందితే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. మోదీ ప్రసంగిస్తుండగా ఆద్యంతం చప్పట్లతో మోదీ …. మోదీ … అంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యులు నినదించారు.  ప్రపంచభివృద్దికోసం భారత్ – అమెరికా కలిసి నడవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. అమెరికాలో ప్రఖ్యాత విద్యాలున్నాయని, భారత్ లో అతి పెద్ద యువశక్తి ఉందని చెబుతూ ఈ రెండు కలిస్తే సుస్థిర.. సమ్మిళిత ప్రపంచాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని వివరించారు.

 ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు భారత్ ఒత్తిడి చేస్తోందని చెబుతూ భారత్-అమెరికా డిఎన్‌ఎలోనే ప్రజాస్వామ్యం ఉందని మోదీ  స్పష్టం చేశారు. భారత్‌లో వివక్షకు తావులేదని, కృతిమ మేథస్సు, సెమీ కండక్టర్ అంశాలే ప్రధానంగా చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. జి-20 హామీలను నిలబెట్టుకున్న ఏకైక దేశం భారత్ అని ప్రశంసించారు. హరిత హైడ్రోజన్ కేంద్రంగా భారత్ అవతరించనుందని తెలిపారు.

అంతకు ముందు, ఆమెరికా-బైడెన్ సంయుక్త ప్రకటన విడుదల సందర్భంగా భారత్-అమెరికా సంబంధాల్లో ముఖ్యమైన రోజు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ప్రశంసించారు. వాణిజ్య సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించామని చెప్పారు. బెంగళూరు, అహ్మదాబాద్‌లో కాన్సులేట్ల ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నామని, భారత్-అమెరికా మధ్య వాణిజ్య సహకారం విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్-అమెరికా ఉమ్మడి పోరాటం చేస్తుందని ప్రశంసించారు.

బెంగళూరు, అహ్మదాబాద్‌లో కాన్సులేట్ల ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నామని, భారత్-అమెరికా మధ్య వాణిజ్య సహకారం విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్-అమెరికా ఉమ్మడి పోరాటం చేస్తుందని ప్రశంసించారు.