
బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో వరుసగా రెండో రోజు ఆదాయపన్ను (ఐటీ) అధికారులు సోదాలు జరుపుతున్నారు. బుధవారం ఉదయం నుంచి భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల నివాసాలు, కార్యాలయాలతో పాటు వారి సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు అమీర్‌పేటలోని కార్పొరేట్ ఆఫీసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మర్రి జనార్థన్ రెడ్డి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివారులోని పైపుల తయారీ పరిశ్రమ కూడా జనార్దన్‌రెడ్డిదేనన్న అనుమానంతో అధికారులు అక్కడా కూడా తనిఖీలు చేస్తున్నారు.
హైదరాబాద్ కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న భువనగిరి ఎ్మమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇల్లు, ఆఫీస్‌లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తీర్థ గ్రూప్ పేరుతో ఫైళ్ల మైనింగ్, రియల్ ఎస్టేట్, లిథియం బ్యాటరీలు, సోలార్ ఎనర్జీ వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాద్, కర్ణాటకలలో పలు కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులను తీర్థ గ్రూప్ పూర్తి చేసింది.
ఆఫ్రికాలోనూ తీర్థ గ్రూప్ మైనింగ్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ రెండు కంపెనీలకు పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మైలాన్ డిజిటల్ టెక్నాలజీలో కొత్త ప్రభాకర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి భాగస్వాములుగా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు.
ముగ్గురు నేతలు కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ గుర్తించింది. నేతల సతీమనులు, కుటుంబ సభ్యులు డైరెక్టర్స్‌గా ఉన్న కంపెనీలపై ఐటీ ఫోకస్ చేసింది. బ్యాంకు లాకర్స్‌ను సైతం ఓపెన్ చేసిన ఐటీ అధికారులు పలు కీలక పత్రాలు, సమాచారం సేకరించారు. ఆదాయం పన్ను చెల్లింపుల అవకతవకలపైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి