 
                మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపి అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. అవినాష్‌కు మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. సిబిఐ అరెస్ట్, విచారణ నుంచి వారంరోజుల పాటు మినహాయింపు ఇవ్వాలన్న అవినాష్ విజ్ఞప్తిని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.
ఈ విషయంలో తాము జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. అయితే, హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణపై సుప్రీం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎంపి అవినాష్ ముందస్తు బెయిల్ పై ఈనెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వీలైనంత వరకు అదేరోజు విచారణ ముగించేందుకు ప్రయత్నించాలని సూచించింది.
మరోవైపు విచారణ సందర్భంగా… సీబీఐ నోటీసులకు ఎందుకు స్పందించడం లేదని, విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అవినాశ్ తరపు లాయర్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అన్ని పక్షాలు వెకేషన్ బెంచ్ ముందే వాదనలు వినిపించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
‘వచ్చే నెల 6న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చేవరకు అరెస్టు చేయకుండా ఆదేశించండి. లేదంటే ఈ నెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించాలని ఆదేశించి అప్పటి వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులివ్వండి’ అంటూ తన పిటీషన్ లో అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును  అభ్యర్థించారు.





More Stories
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
మొంథా తుపాను ప్రాథమిక నష్టం రూ.5265 కోట్లు