మన ఈక్విటీ మార్కెట్లలో కొనుగోళ్ల ఆసక్తి పెంచుకున్న విదేశీ పెట్టుబడిదారులు మే నెలలో ఇప్పటిదాకా రూ. 23,152 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరోసారి పెంచే అవకాశం లేదని తెలవడంతోపాటు, దేశీయంగా మార్కెట్లో అనుకూలమైన పరిస్థితులు ఉండటం వల్లే కొనుగోళ్లకు ఎఫ్‌పీఐలు ఇష్టపడుతున్నారు.
2023 లో ఎఫ్‌పీఐలు రూ. 8,572 కోట్ల కొనుగోళ్లతో నెట్ బయ్యర్లుగా నిలుస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ ఎఫ్‌పీఐల కొనుగోళ్ల దూకుడు ఇలాగే కొనసాగుతుందనే భావిస్తున్నారు. రూపాయి బలపడటంతోపాటు, మరోవైపు డాలర్బలహీనం అవుతుండటంతో ఎఫ్‌పీఐలు సమీప భవిష్యత్‌లో మన మార్కెట్లో కొనుగోళ్లనే చేస్తారని చెబుతున్నారు.
డిపాజిటరీల డేటా ప్రకారం మే 2–మే 12 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు ఏకంగా రూ. 23,152 కోట్లను మన ఈక్విటీ మార్కెట్లో వెచ్చించాయి. ఇంతకు ముందు ఏప్రిల్నెలలో రూ. 11,630 కోట్లు, మార్చి నెలలో రూ. 7,936 కోట్లను ఎఫ్‌పీఐలు పెట్టాయి. ఆర్ధిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో చూస్తే నికరంగా రూ. 34,000 కోట్ల పెట్టుబడులను ఎఫ్‌పీఐలు వెనక్కి తీసుకున్నాయి.
యూఎస్ రీజినల్ బ్యాంకులు రిస్క్‌లో పడటంతో మార్చి నెలలో కొంత అనిశ్చితి నెలకొందని, గ్లోబల్‌గా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో నమ్మకం పెరిగి ఏప్రిల్, మే నెలల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు అధికమయ్యాయని చెబుతున్నారు. మే నెలలో డెట్ మార్కెట్లోనూ రూ. 68 కోట్లను ఎఫ్‌పీఐలు పెట్టుబడిగా పెట్టారు. ఫైనాన్షియల్ సెక్టార్లో జోరు కొనసాగిస్తూనే, క్యాపిటల్ గూడ్స్, ఆటో సెక్టార్లలోనూ ఎఫ్‌పీఐలు పెట్టుబడులు పెడుతున్నారు.
భారతీయ ఈక్విటీ షేర్ల విలువ గరిష్ఠానికి చేరడంతో 2023 మొదటి మూడు నెలల్లో ఎఫ్‌పిఐ ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగించారు. మరోవైపు చైనాలో కరోనా లాక్‌డౌన్ తగ్గి మళ్లీ పనులు ప్రారంభించడంతో ఇన్వెస్టర్లు బీజింగ్ వైపు మొగ్గుచూపారు. కానీ ఇప్పుడు ఎఫ్‌పిఐ ఇన్వెస్టర్లకు వర్ధమాన దేశాల్లో భారత్ మరోసారి అనుకూలమైన దేశంగా మారిందని భావిస్తున్నారు.
అదే సమయంలో భారతదేశంలో స్థూల ఆర్థిక అంశాలు మెరుగవడడం కూడా విదేశీ పెట్టుబడుల ప్రవాహానికి కారణమైంది. ఏప్రిల్‌లో ఆఖరి వారాల్లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం ప్రారంభమైంది.
More Stories
నిషేధానికి ముందే అమెరికాలో టిక్ టాక్ నిలిపివేత
కరోనా తర్వాత కంగనాకు అతిపెద్ద ఓపెనింగ్ ‘ఎమర్జెన్సీ’
బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయం పన్ను బిల్లు