బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ మిస్సైల్‌ టెస్ట్‌ విజయవంతం

 
భారత నావికాదళం ఫ్రంట్‌లైన్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ మోర్ముగావ్ నుంచి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ నిర్ధిష్ట లక్ష్యాన్ని ఛేదించిందని నేవీ అధికారులు తెలిపారు. లక్ష్యాన్ని ఛేదించింది.  ఈ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మార్ముగావ్, దీనిలోని ఆయుధాలు స్వదేశీవేనని, ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా తయారు చేసినవని పేర్కొంది. 
2022 డిసెంబరు 18న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తదితర ఉన్నతాధికారుల సమక్షంలో నాలుగు విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్లను జల ప్రవేశం చేయించారు.  ఇందులో రెండోది ఐఎన్ఎస్ మార్ముగావ్.  దీన్ని భారత నావికా దళంలోని వార్‌షిప్ డిజైన్ బ్యూరోలో డిజైన్ రూపొందించగా, మజగావ్ డాక్ షిప్‌లో తయారు చేశారు.
గోవాలోని మార్ముగావ్ నౌకాశ్రయం పేరును ఈ మిస్సైల్‌ డిస్ట్రాయర్‌కు పెట్టారు. 15బీ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ల ప్రాజెక్టులో ఐఎన్ఎస్ మార్ముగావ్ రెండోది.
కాగా.. ఇందులో అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులను ప్రయోగించే వీలుంటుంది. ఆధునిక నిఘా రాడార్‌ను ఏర్పాటు చేశారు.  జలాంతర్గాములపై దాడి చేయగలిగే సత్తా కూడా దీనికి ఉంది.
 
మన దేశంలోనే తయారు చేసిన టార్పెడో లాంచర్స్, రాకెట్ లాంచర్స్ వంటివి ఉన్నాయి. జీవసంబంధ, రసాయనిక, అణ్వాయుధాలతో పోరాడే సామర్థ్యం కూడా దీనికి ఉంది. టెక్నాలజీపరంగా చూసినపుడు ప్రపంచంలో అత్యుత్తమంగా అభివృద్ధి చెందిన మిసైల్ క్యారియర్లలో ఇదొకటి.