చైనా, రష్యాలతో ఉద్రికత్తలే జి7 ప్రధాన ఎజెండా

బ్యాంక్‌ నిర్వహణలు, సైబర్‌ భద్రత, ఆర్థిక భద్రతకుహామీ కల్పించేందుకు మరింత విశ్వసనీయమైన సరఫరా మార్గాలను నిర్మించడం వంటి అంశాలు జపాన్ లోని నిగతాలో జరుగుతును జి 7 చర్చల ఎజెండాగా ఉన్నాయి. ఈ ఏడాది జపాన్‌లో జరుగుతును సంపన్న దేశాల కూటమి జి 7 సమావేశాల చర్చల్లో ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాతో, అలాగే చైనాతో తలెత్తిన ఉద్రిక్తతలు ప్రధాన స్థానాన్ని ఆక్రమించాయి.
 
నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను కాపాడేందుకుగానూ చైనా ‘ఆర్థిక ఒత్తిళ్ళను’ నివారించేందుకుగల మార్గాలపై జి 7 ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ చీఫ్‌లు చర్చించారు. అయితే చైనా ఈ సమావేశాన్ని  తీవ్రంగా విమర్శించింది. జి 7ను కపటత్వం గల గ్రూపు అంటూ విమర్శలు చేసింది. 
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మాట్లాడుతూ, అంతర్జాతీయ నిబంధనలు అంటూ జి 7 మాట్లాడుతూ పశ్చిమ దేశాలు వారి సిద్ధాంతాలు, విలువలను అనుసరించి పెట్టుకున్న నిబంధనలు, అవి అమెరికా అన్నింటికంటే ముందు నిలుపుతాయి అంటూ విమర్శించారు. ”అంతర్జాతీయ నిబంధనలకు చైనా కట్టుబడి వుండాలని జి7 డిమాండ్‌ చేస్తోంది. కానీ అసలు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించే వారే దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని వాంగ్‌ విమర్శించారు.
 
చర్చలకుముందు అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌ మాట్లాడుతూ, చైనా ఆర్థిక పోటీతత్వాన్ని దెబ్బతీయడం లేదా వారిని ఆర్థికంగా ముందుకెళ్ళకుండా నివారించడంపై ఈ చర్చలు దృష్టి కేంద్రీకరించడం లేదని చెప్పారు. ఆర్థిక ఒత్తిళ్ళను ఇతర దేశాలపై చైనా ఉపయోగిస్తుందనడానికి ఉదాహరణలు వున్నాయని ఆమె స్పష్టం చేశారు.
 
ఈ తరహా కార్యకలాపాల పట్ల జి 7 ఆందోళన చెందుతోందని, ఇటువంటి వైఆమె ఖరిని అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకోగలమనేదే పరిశీలిస్తోందని చెప్పారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం కొనసాగించే సామర్ధ్యానిు దెబ్బతీసేందుకుగల మార్గాలను కూడా పరిశీలిస్తునుట్లు చెప్పారు.