నారీదళంతోనే రిపబ్లిక్‌ డే పరేడ్‌!

దేశ రాజధానిలోని కర్తవ్యపథ్‌లో వచ్చే ఏడాది జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో అన్నీ మహిళా బృందాలే పాల్గననున్నాయి. త్రివిధ దళాల నుంచి పాల్గనే బృందాలు, బ్యాండ్‌ బృందాలు అన్నింటిలోనూ మహిళలే ఉండే విధంగా ఒక ప్రతిపాదనపై అధికారులు కృషి చేస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
ఈ మేరకు త్రివిధ దళాలు, వివిధ మంత్రిత్వ శాఖలకు ఒక అధికారిక మెమొరాండం పంపినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ విషయంపై ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో రక్షణశాఖ కార్యదర్శి అధ్యక్షతన సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో చర్చల తరువాత కర్తవ్యపథ్‌లో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌ 2024లో అనిు కాంటింజెంట్స్‌, టేబులాక్స్‌, ఇతర ప్రదర్శనల్లో మహిళలే పాల్గనాలని నిర్ణయించారని పేర్కొంది.
 
ఏటా వార్షిక పరేడ్లలో పురుషుల బృందాలతో పాటు కొన్ని మహిళా బృందాలు కూడా పాల్గంటున్నాయి. ఈ ఏడాది జరిగిన 74వ రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ‘నారీ శక్తి’ ప్రధాన ఇతివృత్తంగా భారతదేశ సైనిక శక్తిని, శక్తివంతమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించారు. 144 మంది వైమానిక పురుష అధికారులతో కూడిన కవాతు బృందానికి ఒక మహిళా అధికారి నేతృత్వం వహించారు.
 
అయితే వచ్చే ఏడాది, పరేడ్‌లో బ్యాండ్‌లు, మార్చ్‌, శకటాలు, ప్రదర్శనలు మహిళలే నిర్వహించనున్నట్టు చెప్పారు. ఏటా గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో పరేడ్‌ ఘనంగా జరుగుతుంది. సంబంధిత ఏర్పాట్లు చేయాల్సిందిగా త్రివిధ దళాలకు, ప్రభుత్వ శాఖలను ఆదేశించినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.