ఐపీఎల్‌లో 7000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ  చారిత్రక రికార్డ్ నెలకొల్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జజరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 19 పరుగులు చేసిన విరాట్ కోహ్ ఐపీఎల్‌లో 7000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌కి ముందు 6988 పరుగులతో ఉన్న విరాట్ కోహ్లీ పవర్ ప్లే ముగిసేలోపే మూడు బౌండరీల సాయంతో ఈ రికార్డ్‌ని అందుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ ఇప్పటికే ఆడిన 9 మ్యాచ్‌ల్లో 376 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. తాజాగా 46 బంతు్లో 55 ప‌రుగులతో 6వ హాఫ్ సెంచరీ చేశారు.

 ఓవరాల్‌గా 233 మ్యాచ్‌లాడి 129.53 స్ట్రైక్‌రేట్‌తో 7000* పరుగులు కోహ్లీ చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండగా, 614 ఫోర్లు, 229 సిక్సర్లు ఉన్నాయి. మొత్తంమీద, ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత.. శిఖర్ ధావన్ (6536), డేవిడ్ వార్నర్ (6189), రోహిత్ శర్మ (6063), సురేశ్ రైనా (5528), ఏబీ డివిలియర్స్ (5162), మహేంద్రసింగ్ ధోనీ (5054) టాప్-7లో కొనసాగుతున్నారు.

2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా మొదటి సీజన్ నుంచి బెంగళూరు టీమ్‌కే విరాట్ కోహ్లీ ఆడుతున్న విషయం తెలిసిందే. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఒకే టీమ్‌కి అన్ని సీజన్లూ ఆడిన ఏకైక ప్లేయర్ కోహ్లీనే కావడం గమనార్హం.

నేను ఏం తప్పు చేశా… బిసిసిఐకి కోహ్లీ లేఖ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్  సందర్భంగా లక్నో మెంటర్ గౌతమ్‌గంభీర్- విరాట్ కోహ్లీ మధ్య గొడవ జరగడంతో పాటు తారాస్థాయికి చేరుకుంది. దానితో బిసిసిఐ కోహ్లీ, గంభీర్‌లకు వంద శాతం, నవీనుల్‌కు 50 శాతం మ్యాచ్‌లో ఫీజు కోత విధించింది. విరాట్ తరపున బెంగళూరు జట్లు యాజమాన్యం రూ.1.07 కోట్లు జరిమానా చెల్లించింది.
 
అయితే, దీంతో అంత పెద్ద తప్పు తాను ఏం చేశానని అభ్యంతరం తెలుపుతూ బిసిసిఐకి విరాట్ కోహ్లీ లేఖ రాశారు. తాను కావాలని ఎవరితో ఘర్షణకు దిగలేదని, ముందు వారే తన టీమ్‌ను రెచ్చగొట్టారని, దానికి మాత్రమే తాను సమాధానం ఇచ్చానని చెప్పుకొచ్చారు. వంద శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించేంత తప్పు చేయలేదని స్పష్టం చేశారు.