నైట్ విజ‌న్ గ‌గుల్స్‌తో సుడాన్‌లో సాహసోపేత ఆప‌రేష‌న్‌

సుడాన్‌లో చిక్కుకున్న భార‌తీయుల్ని ర‌క్షించేందుకు `ఆప‌రేష‌న్ కావేరి’ చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే అత్యంత డేరింగ్‌గా ఆ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. ఎయిర్‌ఫోర్స్ పైలెట్లు నైట్ విజ‌న్ గ‌గుల్స్‌తో సుడాన్‌లో ఓ రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. సీ-130జే హెరిక్యూల్స్ విమానానికి చెందిన పైలెట్లు ఆ డేరింగ్ స్టంట్ చేప‌ట్టారు.
 
క‌టిక చీక‌ట్లో నైట్ విజ‌న్ గ‌గుల్స్ పెట్టుకుని అతి చిన్న ర‌న్‌వేపై విమానాన్ని మ‌న పైలెట్లు దింపారు. రాజ‌ధాని ఖ‌ర్తూమ్‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న వాది స‌య్యిద్నా ఎయిర్‌పోర్టులో పైలెట్లు విమానాన్ని ల్యాండ్ చేశారు.  ర‌న్‌వే క్లియ‌ర్ ఉంద‌ని తెలిసిన త‌ర్వాత ఆ విమాన పైలెట్లు ఆప‌రేష‌న్ కొన‌సాగించారు.
 
ల్యాండ్ అయిన త‌ర్వాత విమాన ఇంజిన్ల‌ను ఆన్‌లోనే ఉంచారు. ఎయిర్‌ఫోర్స్ స్పెష‌ల్ యూనిట్లకు చెందిన 8 మంది గ‌రుడ క‌మాండోలు ప్ర‌యాణికుల్ని సుర‌క్షితంగా విమానం ఎక్కించారు. చాలా చీక‌టిగా ఉన్న ఆ ఎయిర్‌స్ట్రిప్‌పై  నైట్ విజ‌న్ గ‌గుల్స్‌తోనే టేకాఫ్ చేప‌ట్టారు. రెండున్న‌ర గంట‌ల పాటు ఆ ఆప‌రేష‌న్ కొన‌సాగింది.సీ-130 జే విమానానికి గ్రూపు కెప్టెన్‌గా ర‌వి నంద ఉన్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో కూడా 2021 ఆగ‌స్టులో ఆప‌రేష‌న్ దేవి శ‌క్తి చేప‌ట్టిన‌ప్పుడు కెప్టెన్ ర‌వి ఇలాంటి డేరింగ్ స్టంట్ చేప‌ట్టారు. ఆ సాహ‌సోప‌త ఆప‌రేష‌న్ చేప‌ట్టిన ఆయ‌న్ను గ్యాలెంట‌రీ అవార్డుతో స‌త్క‌రించారు.

ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ వాసులు

కాగా, ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా శుక్రవారం సుడాన్ నుంచి భారతీయలను ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం విమానశ్రయానికి తీసుకు వచ్చింది. ఈ సందర్భంగా ఢిల్లీకి చేరుకున్న తెలంగాణకు చెందిన 17 మంది సుడాన్ బాధితుల తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఢిల్లీలోని విమనాశ్రమయంలో వారికి స్వాగతం పలికారు. వారు స్వస్థలాలకు క్షేమంగా వెళ్ళేందుకు చేసిన ఏర్పాట్లను ఆయన వివరించారు.

కాగా గురువారం సుడాన్ నుంచి ముంబాయి ఎయిర్ పోర్టుకు 14 మంది చేరుకోగా వీరితో కలిపి మొత్తం 31 మంది తెలంగాణ వాసులు చేరుకున్నారు. న్యూ ఢిల్లీ విమనాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ లైన్ కౌంటర్ ద్వారా కొందరిని హైదరాబాద్, ఇతర స్థలాలకు పంపించడంతోపాటు మరి కొందరికి తెలంగాణ భవన్‌లో త్కాలికంగా ఆశ్రయం కల్పించారు.