సమన్వయంతోనే జల వివాదం పరిష్కారం

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం చాలా చిన్నదని, సమన్వయంతో పరిష్కారమవుతుందని కేఆర్‌ఎంబీ (కృష్ణ రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు) చైర్మన్‌ శివానందన్‌కుమార్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ అధికారులతో కలిసి ప్రధాన ఆనకట్ట, స్పిల్‌వే, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం, గ్యాలరీలను పరిశీలించారు.
 
ఈసందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులు స్నేహపూర్వక వాతావరణంలో సమావేశమై సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కేటాయించిన నీటి కన్నా ఎక్కువగా నీటిని వినియోగించుకున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తగదాని హితవు చెప్పారు.
 
ఇరు రాష్ట్రాల అధికారులు నిజాయితీతో వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రతి యేటా కృష్ణా నది నీటి వినియోగం విషయంలో సమస్యలు తలెత్తడం ఇరు రాష్ట్రాలకు మంచిది కాదని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల సంబంధిత అధికారులు ఓ చోట చేరి సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమమైనదని భావిస్తున్నామని ఆయన చెప్పారు.
 
 లేకుండా తామే ఇరు రాష్ట్రాల వారిని ఓ చోటికి చేర్చి సమస్యను పరిష్కరించి వివాదాలు లేకుండా చేస్తామని తెలిపారు. మంగళవారం కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌తోపాటు విద్యుత్‌ ఉత్పాదన కేంద్రం, టెలిమెట్రీలను పరిశీలిస్తామని చెప్పారు.
 
కాగా, నది పరివాహక ప్రాంతం అధి కంగా ఉన్న తెలంగాణలో కష్ణా నదీజలాల వాటాలో జరి గిన అన్యాయం పై తెలంగాణ చేస్తున్న అభ్యంతరాలు, ఏపీ చేసిన ఆరోపణలపై కృష్ణా ట్రిబ్యునల్‌ మంగళ, బుధవారాలలో సమావేశం కానుంది. కృష్ణా నదీ జలాల పంపకాల్లో రెండు రాష్ట్రాలకు సమన్వయం కుదరడంలేదు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో కృష్ణా జలాల వివాదం ముదురుతోంది.
 
అలాగే ఇప్పటివరకు వివియోగించుకోని కృష్ణా జాలాలను వాటాలో చేర్చవద్దని తెలంగాణ డిమాండ్‌ చేస్తుంది. రాష్ట్రంలో ఉపయోగించుకోని మిగులు జలాలను ప్రస్తుతం యాసంగికి ఉపయోగించుకుంటామని తెలంగాణ పట్టుబడుతోంది. ప్రధానంగా ఇప్పుడు  జరగనున్న కృష్ణా ట్రిబ్యునల్‌ సమావేశంలో పాలమూరు రంగారెడ్డి, పోతిరెడ్డి పాడు చర్చనీయాంశంకానుండగా తెలంగాణ పట్టువిడవకుండా కృష్ణా జలాల్లో 50 శాతం కోసం పట్టు బిగించనుంది.