
ఈ ఏడాది ఎల్‌నినో ముప్పు పొంచి వుందని వాతావరణ పరిశోధకులు హెచ్చరిస్తునాురు. ఈసారి రుతుపవనాలు సమృద్ధిగా వుంటాయని చెప్పలేమని భారత వాతావరణ విభాగం (ఐఎండి), ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైనెట్ పేర్కొన్నాయి. జూన్‌లో ఎల్‌నినో రాగలదని ప్రస్తుతం వేస్తున్న అంచనాలతో ఈసారి వర్షాకాలం సీజను దెబ్బతినేందుకు అవకాశాలు కూడా వున్నాయని భావిస్తున్నారు.
”ఈ ఏడాది ఎల్‌నినో భయం వాస్తవం. వర్షాకాలం రెండో అర్ధభాగంలో దీనిప్రభావం వుండగలదని అంచనా.” అని స్కైనెట్, ఐఎండి హెచ్చరించాయి. ప్రస్తుతం దీర్ఘకాల సగటు (ఎల్‌పిఎ)లో 94శాతం సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని స్కైనెట్, 96శాతం సాధారణం కంటే తక్కువ వుంటుందని ఐఎండి పేర్కొన్నాయి.
రెండు సంస్థల అంచనాలు ఐదు శాతం అటూ ఇటూ ఎర్రర్ వుంటుందని భావించినా మొత్తమ్మీద స్థూలంగా ఒక్క మాదిరి అంచనాలు వున్నాయి. వర్షాకాలం సీజన్ అయిన జూన్, జులై, ఆగస్టు మధ్యలో ఎల్‌నినో సంభవించే అవకాశాలు దాదాపు 70శాతం వున్నాయని ఐఎండి పేర్కొంది.
ఒకవేళ జూన్‌లో ఎల్‌నినో ఏర్పడకపోతే జులైలో సంభవించడానికి 80శాతం అవకాశాలు వుంటాయని తెలిపింది. జూన్‌లో ఎల్‌నినో ఏర్పడే అవకాశాలు 50శాతం వరకూ వున్నాయని ఐఎండి ఈ వారం ప్రారంభంలో తెలిపింది. జూన్‌లోనే ఎల్‌నినో రావడానికి అత్యధిక అవకాశాలు వున్నాయని అమెరికా వాతావరణ సంస్థ తాజాగా పేర్కొంది.
ఎల్‌నినో నెలకొనడం వల్ల భారతదేశంలో కరువు ముంచు కురావచ్చు. 2000 నుండి ఇప్పటివరకు ఆరు సంవత్సరాలు ఎల్‌నినో ప్రభావం కనబడింది. 2002, 2004, 2009, 2014, 2015, 2018ల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఈ ఆరేళ్లలో ఐదేళ్లు కరువు పరిస్థితులు నెలకొనాుయి. వాటిల్లో 2002, 2009లలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది.
2018లో ఎల్‌నినో సంభవించినప్పటికీ కరువు పరిస్థితులను తృటిలో తప్పించుకోగలిగాం. 90.6శాతం వర్షపాతం నమోదైంది. అమెరికా, దక్షిణ అమెరికావంటి ప్రాంతాలకు ఎల్‌నినో వల్ల కరువు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం వుంటుంది. హరికేన్ల ప్రభావం తగ్గుతుంది. కానీ అదే భారత్, ఆస్ట్రేలియాతో పాటూ ఆసియాలోనిఇతర ప్రాంతాల్లో ఎల్‌నినో అంటే మరింత వేడిమి, మరింత పొడి పరిస్థితులు నెలకొంటాయి. గత నాలుగేళ్లలో నైరుతి రుతుపవనాల వల్ల భారత్‌లో సాధారణం కనాు మించి లేదాసాధారణ వర్షపాతం నమోదైంది.
ట్రిపుల్ డిప్ లా నినా ఇందుకుకారణమని వాతావరణ శాస్త్రవేత్త డేనియల్ స్వెయిన్ మీడియాకు తెలిపారు. గత 140 ఏళ్లలో భారతదేశంలో సగానికిపైగా ప్రధానమైన కరువులు ఎల్‌నినో కారణంగానే సంభవించాయి. ఎల్‌నినో వల్ల కలిగే ఇతర ప్రభావాల్లో దోమల సంబంధిత వ్యాధులు మలేరియా, డెంగీ వంటివి ప్రబలే అవకాశముంది.
More Stories
భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
దేశంలో ర్యాగింగ్ మరణాల సంఖ్య 2020- 2024లో 51
ఈ నెల 29న సూర్యగ్రహణం