ప్రపంచ టాప్ 10 ప్రముఖ అథ్లెట్లలో విరాట్ కోహ్లీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న‌ క్రీడారంగం ద్వారా వివిధ క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో అద్వితీయమైన విజయాలను, కొత్త రికార్డ్స్ ని సృష్టిస్తున్నారు. క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, రెజ్లింగ్ వంటి క్రీడల్లో ఆటగాళ్లు జట్టుగా, వ్యక్తిగతంగా అనూహ్య విజయాలు సాధిస్తున్నారు. దీంతో, చాలా మంది ఆటగాళ్లు ప్రపంచ ప్రజలను తమ వైపుకు ఆకర్షిస్తూ, ఆటపై ఆసక్తిని కలిగిస్తారు.
 
అయితే, ఈ అథ్లెట్లు తమ తమ రంగాల్లో రాణించడమే కాకుండా ఔత్సాహిక క్రీడాకారులు, అభిమానులకు ప్రపంచ రోల్ మోడల్‌లుగా కూడా మారారు. ఈ విధంగా, ప్రస్తుత సంవత్సరం (2023)లో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ 10 మంది క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది స్పోర్ట్‌హబ్‌నెట్.  ఈ జాబితాలో భారత దేశ క్రీడాకారులతో విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు దక్కడం విశేషం.
 
ఈ జాబితాలో ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో ముందు వరుసలో ఉన్నాడు. ఇక‌, లియోనెల్ మెస్సీ, నెయ్‌మార్ జూనియర్‌లు టాప్ 3 స్థానాలను ఆక్రమించారు. వీరి తర్వాత ప్రముఖ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ 4వ స్థానంలో, భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ 5వ స్థానంలో నిలిచి ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన క్రికెటర్‌గా తనదైన ముద్ర వేసుకున్నాడు.
 

అలాగే, కానర్ మెక్‌గ్రెగర్ (రెజ్లింగ్), రోజర్ ఫెదరర్ (టెన్నిస్), రాఫెల్ సి నాదల్ (టెన్నిస్), జాన్ చైనా (రెజ్లింగ్) మరియు టైగర్ వుడ్స్ (గోల్ఫ్) టాప్ 10లో ఉన్నారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ.

2023 టాప్ 10 అథ్లెట్లు: 1 క్రిస్టియానో రొనాల్డో, 2 లియోనెల్ మెస్సీ, 3 నేమార్ జూనియర్, 4 లెబ్రాన్ జేమ్స్, 5 విరాట్ కోహ్లీ, 6 కోనార్ మెక్‌గ్రెగర్, 7 రోజర్ ఫెదరర్, 8 రాఫెల్ నాదల్ , 9 జాన్ సెనా, 10 టైగర్ వుడ్స్. ఈ అథ్లెట్లు తమ అద్భుతమైన ప్రదర్శనల ద్వారా మాత్రమే కాకుండా వారి ఆఫ్-ఫీల్డ్ చరిష్మా, వ్యక్తిత్వాల ద్వారా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు.