రూ 719 కోట్లతో అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

దేశంలోనే నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ లలో ఒకటైన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ త్వరలో విమానాశ్రయాన్ని తలపించే విధంగా అత్యాధునిక హంగులతో సరికొత్త రూపు సంతరింప చేసుకోనుంది.  అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే విధంగా రూ 719 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులకు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు.

రాబోయే 50 ఏళ్లకు సరిపోయేలా సకల సౌకర్యాలు ఏర్పా టు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన దేశంలోని ప్రధానమైన రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కూడా ఒకటి.  దక్షిణ మధ్య రైల్వే జోన్‌కే తలమానికంగా నిలవనున్న ఈ రైల్వే స్టేషన్‌లో ప్రయా ణికుల విశ్రాంతి కోసం అత్యంత విలాసవంతమైన లాంజ్‌లు, రైళ్ల రాక పోకలను కచ్చితంగా తెలిపే సమాచార వ్యవస్థను ఏర్పా టు చేయనున్నారు.

కాగా, ఈ రైల్వే స్టేషన్‌ ఆధునికరణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ గతంలోనే రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల రెండు సార్లు వాయిదా పడింది. దీంతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ప్రధాని మోదీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కాగా, తన పర్యటన సంద ర్భంగా ప్రధాని మోదీ  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభిం చను న్నారు.

సికింద్రా బాద్‌- తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ మార్గంలో ప్రయాణించే మిగతా రైళ్ల కన్నా వేగంగా దాదాపు 8 గంటలలోపే గమ్యస్థానానికి ప్రయాణికులను చేర వేయనుంది. తాజాగా ఈ రైలుకు రైల్వే శాఖ నంబర్లను కూడా కేటాయించింది. సికింద్రా బాద్‌ నుంచి బయలుదేరే సర్వీసుకు 20701, తిరిగి తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరే సర్వీసుకు 20702 నంబ ర్లను రైల్వే శాఖ ఖరారు చేసింది.

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రా రంభయ్యే రోజున ఉదయం 11-30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. మిగతా అన్ని రోజుల్లో తెల్లవారు జా మున 6 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి తిరుపతికి మధ్యాహ్నం 2-30 గంటలకు చేరుకుంటుంది.