తెలంగాణాలో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ దుమారం

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా, మొదటిరోజుననే వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ప్రశ్నాపత్రం లీకైంది. పేపర్‌ లీక్‌ పై మండల విద్యాధికారి వెంకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు విచారణలో టీచర్‌ బందెప్ప ఫోన్‌ నుంచి తెలుగు పేపర్‌ లీకైనట్టు గుర్తించారు.
 
పోలీసులు టీచర్‌ బందెప్పను అదుపులోకి తీసుకున్నారు. స్కూల్‌ టీచర్‌ బందెప్ప తెలుగు పేపర్‌ ను వాట్సాప్‌ ద్వారా షేర్‌ చేశాడని వికారాబాద్‌ ఏఎస్పీ మురళి వెల్లడించారు.  ఉదయం 9.37 గంటలకు పేపర్‌ ను వాట్సాప్‌ గ్రూపులో పెట్టాడని వివరించారు. అప్పటికే విద్యార్థులంతా పరీక్ష హాల్లోనే ఉన్నారని తెలిపారు. వాట్సాప్‌ గ్రూపులో ఉన్నవారు ఆ మెసేజ్‌ ను ఉదయం 11 గంటలకు చూశారని ఏఎస్పీ వెల్లడించారు.
 
ఎగ్జామ్‌ హాల్‌ నుంచి క్వశ్చన్‌ పేపర్‌ను బయటికి షేర్‌ చేసినందుకు ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేస్తామని చెప్పారు. కాగా ఈ ఘటనతో  . ఈ క్ర‌మంలో ప్ర‌శ్నాప‌త్రాన్ని బ‌య‌ట‌కు పంపిన ఉపాధ్యాయుడు బంద‌ప్ప‌, మ‌రో ఇన్విజిలేట‌ర్ స‌మ్మ‌ప్ప‌, చీఫ్ సూప‌రింటెండెంట్ శివ‌కుమార్, డిపార్ట్‌మెంట‌ల్ ఆఫీస‌ర్ గోపాల్‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు తెలిపారు. ఈ న‌లుగురిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయ‌డంతో పాటు స‌స్పెండ్ చేసిన‌ట్లు జిల్లా కలెక్ట‌ర్ నారాయ‌ణ రెడ్డి ప్ర‌క‌టించారు.

తాండూరులో పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే పరీక్షా పేపర్ వాట్సాప్ లో చక్కర్లు కొట్టడంతో స్థానికంగా కొందరు స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న  ఇన్విజిలెటర్ బందప్పను  పేపర్ లీకేజ్‌పై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

అయితే మొదట పేపర్ లీక్ కాలేదంటూ వికారాబాద్ డీఈవో రేణుక దేవి ఖండించారు. పేపర్ లీకేజ్ వార్తలను పోలీసులు నిర్ధారించారు. స్కూల్ కు వెళ్లిన పోలీసులు బందప్ప మొబైల్ నుంచి పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు.  మరోవైపు ఇదే విషయంపై కలెక్టర్ నారాయణ రెడ్డితో డీఈవో రేణుకా దేవి సమావేశమయ్యారు.

ప్రశ్నాపత్రం లీక్ చేసిన బందెప్ప స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఇతనికి తాండూరులో ఇన్విజిలేటర్ డ్యూటీ పడింది. సోమవారం ఉదయం టెన్త్ క్లాస్ తెలుగు పేపర్ ఎగ్జామ్ ప్రారంభం అయిన వెంటనే బందెప్ప తన మొబైల్ ఫోన్ నుంచి స్క్రీన్ షాట్స్ తీసి సందెప్ప అనే ఫిజికల్ సైన్స్ లీచర్ కు పోస్ట్ చేశారు.

ఈ సమయంలోనే వాట్సాప్ గ్రూప్ లోని ప్రెస్, మీడియా వాళ్లు ఉండే గ్రూప్ లోని పొరపాటును పోస్ట్ చేశాడు సమ్మప్ప. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి వెంటనే డిలీట్ చేశాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రెస్, మీడియా వాట్సాప్ గ్రూప్ లోకి షేర్ అయిన టెన్త్ తెలుగు పేపర్ ను పోలీసులకు చేరవేశారు మీడియా ప్రతినిధులు. ఈ విధంగా బందెప్ప బండారం బయటపడింది. 

వాస్తవంగా బందెప్పను ఇన్విజిలేటర్ రిలీవర్ కింద కేటాయించారు. తాండూరు నెంబర్ వన్ ప్రభుత్వ పాఠశాలలో విధుల కోసం వచ్చిన స్కూల్ అసిస్టెంట్ బందెప్ప రూం నెంబర్ 5లో ఉన్న ఇన్విజిలేటర్ దగ్గర 9 గంటల 35 నిమిషాలకు పేపర్ తీసుకుని, దాన్ని తన మొబైల్ ఫోన్ లోనే స్క్రీన్ షాట్ తీసి,  సందెప్ప అనే తన మిత్రుడికి పంపించాడు. ఈ క్రమంలోనే ప్రెస్, మీడియా వాట్సాప్ గ్రూపులోకి సైతం పోస్ట్ చేయటం విశేషం. 

ఈ బందెప్పపై గతంలోనూ చాలా ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఈయనపై 2017లో పోక్సో కేసు కూడా నమోదు అయ్యింది. చిన్న పిల్లలపై వేధిస్తున్న క్రమంలోనే ఈ కేసు నమోదైంది. బందెప్ప భార్య కూడా అతను పని చేసే స్కూల్ లోనే పని చేస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు.  ఇప్పటికే రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ నుంచి పేపర్లు లీకైన అంశంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ సమయంలో టెన్త్ పేపర్లు కూడా బయటకు వచ్చాయన్న వార్త అందరినీ షాక్ గురి చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న అంశం ఉత్కంఠగా మారింది.