నేటి నుంచి ఐపీఎల్‌- సీజ‌న్ 16 ప్రారంభం

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న  ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ 2023 సీజన్‌కు శుక్రవారం తెరలేవనుంది. దాదాపు రెండున్నర నెలల పాటు సాగే ఐపిఎల్ సంగ్రామం అభిమానులను కనువిందు చేయనుంది. ఈసారి కూడా పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌తో ఐపిఎల్‌కు తెరలేస్తోంది. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత ఇంటబయటా పద్ధతిలో ఐపిఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.  కరోనా కారణంగా కొన్నేళ్లుగా ఈ పద్ధతికి పుల్‌స్టాప్ పెట్టారు. ప్రస్తుతం కరోనా భయం పూర్తిగా తొలగిపోవడంతో ఈసారి నుంచి పాత పద్ధతిలో ఐపిఎల్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఈ సీజన్‌లో మొత్తం 12 వేదికల్లో ఐపిఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.  అహ్మదాబాద్, జైపూర్, మొహాలీ, న్యూఢిల్లీ, గౌహతి, ధర్మశాల, కోల్‌కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, లక్నోలలో ఐపిఎల్ లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక నాకౌట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను, వేదికలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఐపిఎల్ 2023 సీజన్‌లో పది జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి.

ఈసారి గుజరాత్, చెన్నై, బెంగళూరు, సన్‌రైజర్స్, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో,పంజాబ్, రాజస్థాన్, ముంజై జట్లు బరిలో దిగుతున్నాయి. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్, మాజీ విజేతలు సన్‌రైజర్స్, కోల్‌కతా, చెన్నై, ముంబైలు ఈ సీజన్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తున్నాయి. రాజస్థాన్, ఢిల్లీ జట్లను కూడా తక్కువ అంచనా వేయలేం.

అన్ని జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో ఐపిఎల్ సమరం నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం. ప్రతి సీజన్‌లాగే ఈసారి కూడా ఐపిఎల్ ఆరంభోత్సవ వేడుకలను పకడ్బంధీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ వేడుకలు జరుగనున్నాయి.

రష్మికా మందాన, తమన్నా భాటియా, అర్జిత్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 16వ సీజన్‌ మునుపటి కంటే కాస్తంత విభిన్నంగా జరుగనుంది. ఐపీ ఎల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ కొత్తగా అమ లు చేయబోతున్న వినూత్న నిబంధనలు సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్నా యి.

 టాస్‌ తర్వాత కూడా జట్లను ప్రకటించే వెసులుబాటుతోపాటు, వైడ్‌, నో బాల్స్‌పైనా రివ్యూ కోరే అవకాశం, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన ఈసీజన్‌కు కొత్తదనం తేనున్నా యి. బౌలర్‌ బంతివేసేట ప్పుడు కీపర్‌ లేదా ఫీల్డర్‌ దురుద్దేశ పూర్వకంగా కదిలితే ఫీల్డింగ్‌ జట్టు కు ఐదు పరుగులు పెనాల్టిdగా లభిస్తాయి. పైగా ఆ బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటి స్తారు. ఇక నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తిచేయకుంటే, సర్కిల్‌బయట ఐదుగురు ఫీల్డర్లకు బదులు, నలుగురినే అనుమతిస్తారు.