కేసీఆర్ పాలనలో జరిగిన అన్ని ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అధ్యయనం చేయాలని బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా సింగరేణి కొలువుల్లో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో సమాచారం సేకరించేందుకు సిద్ధమైంది. దీంతోపాటు అతి త్వరలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పర్యటించి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవడంతో టీఎస్సీఎస్సీ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది.
టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్.విఠల్ అధ్యక్షతన పేపర్ లీక్ పై ఏర్పాటైన బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో టాస్క్ ఫోర్స్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి క్రిష్ణ ప్రసాద్, మహిళా మోర్చా జాతీయ నేత కరుణా గోపాల్ హాజరయ్యారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి నివేదిక రూపొందించాలని నిర్ణయించారు. దీంతోపాటు కేసీఆర్ పాలనలో జరిగిన అవకతవకలపైనా ద్రుష్టి సారించాలని నిర్ణయించారు.
ముఖ్యంగా సింగరేణి నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా ద్రుష్టి సారించాలని నిర్ణయించారు. ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి న్యాయ పోరాటం చేయాలనే సమావేశం నిర్ణయించింది.

More Stories
కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి అబద్దాలు!
మెట్రో ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు
ఎసిబి సోదాల్లో సర్వే డిప్యూటీ డైరెక్టర్‌కు రూ.200 కోట్ల ఆస్తుల