కాగా, ప్రభుత్వంలోని వివిధ విభాగాల మధ్య బేదాభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో సహజమని పేర్కొంటూ అంటే పరస్పరం ఘర్షణ పడుతున్నట్లు కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఇవన్నీ సజీవ ప్రజాస్వామ్యం సూచికలని, సంక్షోభం ఏమాత్రం కాదని తేల్చి చెప్పారు.
మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని గుర్తు చేస్తూ భిన్నమైన దృక్పధాల రీత్యా కొన్ని అంశాల విషయంలో భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండటం తప్పనిసరి అని ఆయన తెలిపారు. అంటే దానర్ధం పరస్పరం ఘర్షణలకు దిగడం కాదని చెప్పారు. కార్యనిర్వక వ్యవస్థ, న్యాయవ్యవస్థలు మధ్య అధికారాల విభజన ఉండవచ్చని, అంటే దానర్థం కలసి పనిచేయకపోవడం కాదని స్పష్టం చేశారు.
కేసుల పెండింగ్ పెరిగిపోవడం వంటి సమస్యలను గుర్తించి, పరిష్కారాలు కనుగొనడంకోసం మనం ఒక బృందంగా కలసి పనిచేయాలని ఆయన సూచించారు. భారతదేశంలో ఒకొక్క న్యాయమూర్హ్టి రోజుకు 50 నుండి 60 కేసుల వరకు చూడవలసి వస్తుందని, అందుచేత అంతులేని మానసిక వత్తిడులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు.
కొన్ని సందర్భాలలో న్యాయం సకాలంలో ఇవ్వలేకపోతున్నారని విమర్శలకు కురవుతున్నారని పేర్కొన్నారు. అయితే అది వాస్తవం కాదని స్పష్టం చేశారు. భారత న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాలని ప్రభుత్వం కోరుకొంటుందని, అందుకు అవసరమైన మద్దతు అందిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. బార్, బెంచ్ ఒక నాణెపు రెండు ముఖాలన్ని చెబుతూ ఒకటి లేకుండా మరొకరు ఉండలేవని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా పాల్గొన్నారు.

More Stories
ట్రంప్‌కు క్షమాపణలు చెప్పిన బీబీసీ
బీహార్ లో ఏకపక్షంగా 200 సీట్ల వైపు ఎన్డీయే ప్రభంజనం
ఏపీలో వ్యాపారానికి ప్రశాంతమైన వాతావరణం