భారత్‌- ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ వద్ద ప్రధానుల సందడి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఎంథనీ అల్బనీజ్ గుజరాత్ లోని అహమదాబాద్ లో గల నరేంద్ర మోదీ స్టేడియమ్ లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం జరుగుతున్న నాలుగో స్మారక టెస్ట్ మ్యాచ్ ను కాసేపు చూశారు.

 ఆస్ట్రేలియా ప్రధాని ఏంథని అల్బనీజ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ: ‘‘క్రికెట్ అనేది భారతదేశంలో, ఆస్ట్రేలియాలో ఓ ఉమ్మడి ఉద్వేగం అని చెప్పాలి. భారతదేశం-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో కొంత ఆటను చూడడం కోసం నా మంచి మిత్రుడు, ప్రధాని ఏంథనీ అల్బనీజ్ తో కలసి అహమదాబాద్ కు విచ్చేసినందుకు సంతోషిస్తున్నాను. ఇది కచ్చితం గా ఒక ఉత్తేజదాయకం అయినటువంటి గేమ్ అవుతుంది అని నేను భావిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

అహమదాబాద్ లో టెస్ట్ మ్యాచ్ కు సంబంధించిన దృశ్యాలను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ, ‘‘అహమదాబాద్ నుండి మరికొన్ని దృశ్యాలు. అంతటా క్రికెట్ యే.’’ అని ఒక ట్వీట్ లో తెలిపారు.  ఇద్దరు ప్రధానిలు వచ్చీ రాగానే, వారికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫార్ క్రికెట్ ఇన్ ఇండియా  కార్యదర్శి జయ్ షా,  బిసిసిఐ అధ్యక్షులు రోజర్ బిన్నీ అభినందనలను అందజేశారు. గాయకురాలు ఫాల్గుణి శాహ్ ఆధ్వర్యంలో యూనిటీ ఆఫ్ సింఫనీ పేరిట జరిగిన ఒక సాంస్కృతిక ప్రదర్శనను వారు తిలకించారు.

ప్రధాన మంత్రి టెస్ట్ కేప్ ను టీమ్ ఇండియా సారధి రోహిత్ శర్మకు అందించగా, ఆస్ట్రేలియా ప్రధాని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు టెస్ట్ క్యాప్ లను అందించారు. ఆ తర్వాత స్టేడియమ్ లో గుమికూడిన ఒక భారీ జనసమూహం సమక్షంలో ఇద్దరు ప్రధానులు ఒక గోల్ఫ్ కార్ట్ లో నిలబడి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

రెండు జట్ల నాయకులు టాస్ కోసమని పిచ్ వైపు బయలుదేరగా, ప్రధాన మంత్రి మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఫ్రెండ్ శిప్ హాల్ ఆఫ్ ఫేమ్ వైపునకు వెళ్ళారు. ఇరు దేశాల ప్రధాన మంత్రులను భారతదేశం జట్టు పూర్వ కోచ్, క్రీడాకారుడు రవి శాస్త్రి అనుసరించారు. భారతదేశానికి, ఆస్ట్రేలియాకు మధ్య గల ఘనమైన క్రికెట్ సంబంధి చరిత్రను గురించి వారికి ఆయన వివరించారు.

దీని తరువాత రెండు జట్ల నాయకులు తమ దేశాల ప్రధాన మంత్రుల వెంట ఆటమైదానం లోకి నడచి వెళ్ళారు. నాయకులు ఇరువురు తమ తమ జట్టులను తమ తమ ప్రధాన మంత్రులకు పరిచయం చేశారు. తర్వాత రెండు దేశాల జాతీయ గీతాల ఆలాపన చోటు చేసుకొంది. తర్వాత ఇద్దరు ప్రధానులు ఉభయ క్రికెట్ ఉద్దండ జట్టుల మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ ను చూడడానికి ప్రెసిడెంట్స్ బాక్స్ కేసి కదలారు.