కాగా, 2019 నుంచి పాకిస్థాన్ డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నది. వాటి ద్వారా డ్రగ్స్, ఆయుధాలను అక్రమంగా భారత్ సరిహద్దు ప్రాంతాల్లోకి చేరవేస్తున్నది. అయితే పాకిస్థాన్ వైపు నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించే డ్రోన్లను చాలాసార్లు భద్రతా సిబ్బంది కూల్చివేశారు. కూలిన డ్రోన్ల నుంచి సాధారణంగా హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకునేవారు. అయితే కొన్ని సందర్భాల్లో పిస్టల్స్వంటి ఆయుధాలు కూడా కూలిన డ్రోన్ల వద్ద లభించేవి.
మరోవైపు పంజాబ్తోపాటు రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా పాకిస్థాన్ డ్రోన్లను భద్రతా సిబ్బంది గుర్తించారు. గత ఏడాది 22 డ్రోన్లను కూల్చివేశారు. ఈ ఏడాది గత రెండు వారాల్లో ఎనిమిది డ్రోన్లను కూల్చారు. పాకిస్థాన్ నుంచి వచ్చే డ్రోన్ల సంఖ్య పెరుగుతుండటంతో వాటిపై పత్యేకంగా నిఘా ఉంచారు. కాగా, కూల్చిన డ్రోన్లు చైనాలో తయారైనట్లుగా, వాటికి వినియోగించిన బ్యాటరీలు పాకిస్థాన్లోని కరాచీ కంపెనీలో తయారైనట్లుగా భద్రతా సిబ్బంది గుర్తించారు.

More Stories
‘తలాక్-ఎ-హసన్’ విడాకుల పద్ధతిపై సుప్రీం ప్రశ్నలు
తొలి 9 నెలల్లో 99 శాతం రోజులలో తీవ్రమైన వాతావరణం
ఏటీఎస్ కు మదర్సా విద్యార్థులు, మౌలానాల వివరాలు