
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ మరోమారు ఆస్ట్రేలియా సొంతమైంది. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన ఫైనల్‌లో 19 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా ఆరోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించింది. అనంతరం 157 పరుగుల ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టు బోల్తా పడింది.
సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలవాలి అనుకున్న దక్షిణాఫ్రికాకు నిరాశే మిగిలిందే. మొదటిసారి పొట్టి ప్రపంచకప్ ఫైనల్ చేరిన సఫారీ జట్టు ట్రోఫీని ముద్దాడలేకపోయింది. పురుషుల జట్టు మాదిరిగానే మహిళల జట్టు కూడా ఒత్తిడిని తట్టుకోలేక పోయింది.
ఓపెనర్ లారా వోల్వార్డ్ చివరి వరకు నిలిచి 61 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ సహచరుల నుంచి మద్దతు లభించకపోవడంతో జట్టు ఓటమి పాలైంది. 48 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసిన లారా టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆ తర్వాత చోలే ట్రయాన్ చేసిన 25 పరుగులే రెండో అత్యధికం.
ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడం, పరుగులు పొదుపుగా ఇవ్వడంతో చివర్లో బంతులకు, చేయాల్సిన పరుగులకు మధ్య బాగా అంతరం ఏర్పడింది. దీంతో చివర్లో ఒత్తిడికి గురైన బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు. అంతకుముందు ఓపెనర్ బెత్ మూనీ (74) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 156 పరుగులు చేయగలిగింది. గార్డనర్ 29 పరుగులు, హీలీ 18 పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, మరిజానే కాప్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆరోసారి పొట్టి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. మొదటిసారి ఆ జట్టు 2010లో టీ20 ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత 2012, 2014లో ప్రపంచ కప్ గెలిచింది. దాంతో వరుసగా మూడు సార్లు ఛాంపియన్ అయిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. 2018, 2020, 2023లో కూడా ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఛాంపియన్‌గా అవతరించింది.
More Stories
మారిషస్ మాజీ ప్రధాని జగన్నాథ్ అరెస్ట్
అమెరికా సైన్యంలో దారి మళ్లిన ఆహార నిధులు
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట