మే 31న శ్రీశైలంలో మహా కుంభాభిషేకానికి ప్రధాని మోదీ

దేశంలోనే ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీశైలంలో మే 31న జరిగే మహా కుంబాభిషేకంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోతున్నారు. . తిరుమల తరహాలో శ్రీశైలంకి ప్రత్యేక ప్రతిపత్తి అంశంపై సమాలోచనలు జరుగుతున్న సమయంలో ప్రధాని రాక  ప్రాధాన్యత సంతరింపచేసుకుంది. ఇటీవలనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా సందర్శించారు.
 
నల్లమల అడవులలో కొలువైన శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రంగా గుర్తింపు పొందింది. అతేకాదు ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం రరెండవది.. అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ఆరోది కూడా. దీంతోపాటు దశ భాస్కర క్షేత్రాల్లో ఆరోది. అందుకే శ్రీశైలాన్ని శ్రీగిరి, సిరిగిరి అని భక్తులు పిలుచుకుంటారు.  శ్రీశైలమంటే సంపద్వంతమైన పర్వతమని పండితులు చెబుతారు.
 
అంత్యంత ప్రాముఖ్యమైన ఈక్షేత్రానికి త్వరలో మహార్ధశ రాబోతుందని  ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. శ్రీశైలంకి రోడ్, ట్రైన్, ఎయిర్ కనెక్టివిటీ కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. దేశంలో ఏ దేవాలయానికి లేనన్ని భూములు శ్రీశైలం దేవస్థానానికి ఉన్నాయని చెబుతూ  అందుకే 5300 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందని తెలిపారు.