ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. ఎన్టీఆర్ అందించిన సేవలకు గుర్తుగా ఆయన బొమ్మతో రూ.100 నాణెం ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరిని మింట్ అధికారులు కలిశారు.
పురంధరేశ్వరికి నమునా నాణెం చూయించి సలహాలు కోరారు. వెండితో ఈ నాణెం తయారు చేస్తారని తెలుస్తోంది. ఈ నమూనాకు పురందేశ్వరి ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో ఈ రూ.100 నాణెం విడుదలవుతుందని చెబుతున్నారు.
గతంలోనే రూ.100 నాణెంపై పురంధేశ్వరి స్పష్టత ఇచ్చారు. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఎన్టీఆర్ బొమ్మను రూ.100 నాణెంపై ముద్రించేందుకు ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. 2022 మే 28వ తేదీ నుండి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఈ వెండి నాణెన్ని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

More Stories
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
మొంథా తుపాను ప్రాథమిక నష్టం రూ.5265 కోట్లు