అగ్నివీర్ ల కోసం ఆన్‌లైన్‌ కామన్‌ ప్రవేశ పరీక్షలు

అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ క్రమంలో మార్పులను భారత సైన్యం ప్రకటించింది. సైన్యంలో చేరాలనుకునే అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (సిఇఇ)కి హాజరు కావాల్సి వుంటుంది. ఆ తర్వాత శారీరక ధృడత్వ పరీక్షలకు, వైద్య పరీక్షలకు హాజరవుతారు.
 
తొలుత కొన్నివర్గాలు నుండి వ్యతిరేకత వ్యక్తమైన, క్రమంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అగ్నివీరుల నియమాకాలు దశలవారీగా కొనసాగుతున్నాయి. అర్హత గల వారు అగ్నిపథ్ కింద సైన్యంలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. దానితో ఎంపిక ప్రక్రియలో కొన్ని మార్పులు చేశారు. రిక్రూట్ మెంట్ ర్యాలీలకు బదులుగా ఇకపై ఆర్మీ అధికారులు చేపట్టబోయే అగ్నివీరుల నియామకాలన్నీ కూడా ఆన్ లైన్ విధానంలో ఉంటాయి.
ఈ రిక్రూట్‌మెంట్‌ క్రమంలోనిమార్పుకుసంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్‌లను వివిధ వార్తాపత్రికల్లో ప్రచురిస్తారనిసైనిక వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి మధ్యలో ఇందుకుసంబంధించిన నోటిఫికేషన్‌ జారీ అవుతుందనిభావిస్తునాురు. దేశవ్యాప్తంగా దాదాపు 200చోట్ల మొట్టమొదటి ఆన్‌లైన్‌ సిఇఇ జరుగుతుందని, అందుకుకావాల్సిన ఏర్పాట్లనీు ఖరారయ్యాయని ఆ వర్గాలు తెలిపాయి.
 
రిక్రూట్‌మెంట్‌ ర్యాలీల సమయంలో పెద్ద సంఖ్యలో యువత గుమిగూడకుండా తగ్గించేందుకు, దేశవ్యాప్తంగా విస్తృత ప్రాంతాలకు సమాచారం చేరడం ఈ మార్పు యొక్క ముఖ్యోద్దేశమని ఆ వర్గాలు తెలిపాయి. భారత సైన్యంలో రిక్రూట్‌మెంట్‌లో పరివర్తనా మార్పులు అను శీర్షికతో ప్రముఖ వార్తాపత్రికలో శుక్రవారం ఒక ప్రకటన వచ్చింది.
 
అందులో రిక్రూట్‌మెంట్‌కుచేపట్టే కొత్త మూడంచెల పద్ధతినివివరించారు. మొదటగా ఆన్‌లైన్‌లో పరీక్ష తర్వాత అర్హులైన వారికి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, చివరగా వైద్య పరీక్షలు జరుగుతాయనిఆ ప్రకటన పేర్కొంది.  ఆన్ లైన్ విధానంలో చేపట్టబోయే మొట్టమొదటి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఈ ఏడాది ఏప్రిల్ లో షెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ లో ఆన్ లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మాత్రమే తదుపరి రౌండ్ లో దేహ ధారుడ్యం, మెడికల్ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
 
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సుమారు 200 కేంద్రాల్లో ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటాయి. పాన్ ఇండియా స్థాయిలో దీన్ని చేపట్టబోతోన్నట్లు ఆర్మీ అధికారులు వివరించారు. ఈ విధానం వల్ల దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఒకేసారి ఆన్ లైన్ లో పరీక్షలను రాయగలుగుతారని, అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు వేల సంఖ్యలో అభ్యర్థులు హాజరు కావాల్సిన పరిస్థితి కూడా తప్పుతుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.  అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరింత సులభతరమౌతుందని చెప్పారు. ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే దేహధారుడ్యం, మెడికల్ టెస్టులకు హాజరు కావాల్సి ఉంటుందని వివరించారు.