కేసీఆర్ పాలనలో మోసపోయింది రైతులే

కేసీఆర్ పాలనలో మోసపోయిన వారిలో ముందు వరసలో ఉన్నది రైతులేనని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశంకు అధ్యకత వహిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రం లో వ్యవసాయం ను ప్రోత్సహస్తూ రైతు సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే కెసిఆర్ అవి తెలంగాణ లో రైతులకు అందకుండా అడ్డుపడుతన్నదని ఆరోపించారు.
 
మరొక ప్రక్క లక్ష రూపాయల వ్యవసాయ రుణ మాఫీ హామీ ని అమలు చేయకుండా కెసిఆర్ రైతులను మోసం చేసాడని ధ్వజమెత్తారు, పంటల బీమా లేక రైతులు తెలంగాణ లో తీవ్రంగా నష్టపోతున్నారని, వ్యవసాయం కి 24 గంటల కరెంటు పెద్ద బూటకం దయ్యబట్టారు.  కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా శక్తి కేంద్రల పరిధిలో కెసిఆర్ రైతు వ్యతిరేక విధానాలు నరేంద్ర మోదీ రైతు సంక్షేమ విధానాలపై రైతులతో నిర్వహించే కార్యక్రమాలు జయప్రదం చేయాలని శ్రీధర్ రెడ్డి కిసాన్ మోర్చా శ్రేణులకు విజ్ఞప్తి చేసారు.
 
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమిందర్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులకు ఉపయోగంగా వున్నదని చెప్పారు.  ఈ బడ్జెట్ పై ఫిబ్రవరి 6 నుండి 12 వరకు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రైతులతో జరిగే ఇష్టా గోష్టి కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, పాపయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శులు అంజయ్య యాదవ్, జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యక్షులు కిరణ్ గౌడ్, తిరుపతి రెడ్డి కృష్ణా రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు