తిరుమలలో ధనికులైన భక్తులకే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించారు. వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తిరుమలలో ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు.
తిరుమలలో ఆగమశాస్త్ర నియమాలు పాటించడం లేదని.. శాస్త్ర నియమాలకు విరుద్ధంగా పని చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సొంత ప్రణాళిక ప్రకారమే అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
”తిరుమలలో ఆగమశాస్త్ర నియమాలు పాటించడం లేదు. శాస్త్ర నియమాలకు విరుద్ధంగా పని చేస్తున్నారు. సొంత ప్రణాళిక ప్రకారం తితిదే అధికారులు వ్యవహరిస్తున్నారు. ధనికులైన యాత్రికులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారు.” అని రమణ దీక్షితులు ట్విటర్‌లో పేర్కొన్నారు.
గతంలోనూ ఆయన తిరుమలపై పలు ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 కుటుంబాలు వంశపార్యపరంగా సేవలు చేస్తున్నాయని గుర్తు చేశారు. కానీ.. 30/87 యాక్ట్‌తో వీరిని తొలగించారని పేర్కొంటూ తిరుమలలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.
More Stories
పోలవరంకు కేంద్రం రూ.2,800 కోట్లు విడుదల
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
ధర్మవరంలో “హ్యాండ్లూమ్ క్లస్టర్” ఏర్పరచాలి