రోజ్ గార్ మేళాలో భాగంగా 71 వేల నియామకాలు అందించిన ప్రధాని

ప్రభుత్వ విభాగాలలో, సంస్థలలో కొత్తగా నియామకం జరిగిన వ్యక్తులకు దాదాపు 71,000 నియామక లేఖలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అందించారు. ఉపాధి కల్పనకు అగ్రతాంబూలాన్ని కట్టబెట్టాలనే ప్రధాన మంత్రి వాగ్దానాన్ని నెరవేర్చే దిశలో రోజ్ గార్ మేళా ఒక ముందంజగా ఉంది.

ఈ రోజ్ గార్ మేళా ఉపాధి కల్పనను మరింతగా వృద్ధి కావించడం  ఒక ఉత్ప్రేరకంగా మారగలదని, యువతను సశక్తంచేసి దేశ నిర్మాణంలో వారికి ప్రాతినిధ్యం లభించేందుకు సార్థక అవకాశాలను అందించగలదన్న ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఉద్యోగంలో నియామకం జరిగిన వారితో మాట్లాడారు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగ నియామకలేఖను అందుకున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన సుప్రభ బిశ్వాస్ మొదటగా ప్రధాన మంత్రితో సంభాషించారు.  ఐజిఒటి మాడ్యూల్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి ఆమె వివరిస్తూ, ఈ మాడ్యూల్ వల్ల కలిగే ప్రయోజనాన్ని గురించి ప్రధాని  దృష్టికి తీసుకు వచ్చారు. ఉద్యోగ నిర్వహణలో భాగంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారా? అని కూడా ఆమెను మోదీ అడిగారు. అమ్మాయిలు ప్రతి ఒక్క రంగంలో ముందంజలు వేస్తుండటం పట్ల ప్రధాని  సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 ఎన్ఐటి శ్రీనగర్ లో ఓ జూనియర్ అసిస్టెంట్ గా జమ్ము, కశ్మీర్ లోని శ్రీనగర్ కు చెందిన ఫైజల్ శౌకత్ శాహ్కు నియామకం లభించింది. ఆయన ప్రధానితో మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని దక్కించుకొన్న మొదటి సభ్యుడిని తానే అని చెప్పారు. ఆయనకు ఉద్యోగం రావడం ఆయన తోటివారి మీద చూపించినటువంటి ప్రభావాన్ని గురించి ప్రధాని వాకబు చేశారు.  ఫైజల్ వంటి యువ ప్రతినిధుల ద్వారా జమ్ము, కశ్మీర్ కొత్త శిఖరాలను చేరుకోగలుగుతుందని తాను నమ్ముతున్నట్లు ప్రధానిపేర్కొన్నారు.

మణిపుర్ కు చెందిన వహ్ని చోంగ్ ఎఐఐఎమ్ఎస్ గువాహాటిలో ఒక నర్సింగ్ ఆఫీసర్ గా తన నియామక లేఖను అందుకొన్నారు. దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఆరోగ్య రంగంలో పని చేయాలి అనేది తన స్వప్నం అని ఆమె పేర్కొన్నారు. ఆమె కుటుంబంలో కూడాను ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందినటువంటి ప్రథమ వ్యక్తి వహ్ని చోంగ్ యే. ఎంపిక ప్రక్రియలో ఆమె ఏవైనా అడ్డంకుల ను ఎదుర్కొన్నారా? అంటూ ప్రదాయి అడిగారు. పని ప్రదేశం లో ఎలా ప్రవర్తించాలో అనేది గుర్తెరగడంతో పాటు లైంగిక వేధింపులకు సంబంధించిన నియమావళిని గురించి తాను తెలుసుకోవాలనుకొంటున్నట్లు ఆమె ప్రస్తావించారు.

ఇండియన్ ఈస్టర్న్ రైల్వేలో ఓ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగానికి సంబంధించిన నియామక లేఖను బిహార్ కు చెందిన ఒక దివ్యాంగుడు రాజు కుమార్ అందుకొన్నారు. రాజు తన జీవన యాత్ర గురించి క్లుప్తంగా వివరించడంతో పాటు తాను మరింత ముందుకు పోవాలనుకొంటున్నట్లు వెల్లడించారు.

కోల్ ఇండియా లిమిటెడ్ లో ఒక మేనేజ్ మెంట్ ట్రైనీ గా ఉద్యోగ నియామక లేఖను తెలంగాణకు చెందిన కన్నామల వంశీ కృష్ణ అందుకొన్నారు. వంశీ కృష్ణ తల్లితండ్రులు పడ్డ కష్టాలను గురించి, వారి కఠోర శ్రమను గురించి ప్రధాన మంత్రి తెలుసుకొన్నారు. ఐజిఒటి మాడ్యూల్ మొబైల్ ఫోన్ లలో అందుబాటులో ఉన్నందువల్ల చాలా ఉపయోగకరంగా ఉందని వంశీ కృష్ణ చెప్పారు.

 2023 వ సంవత్సరం లో ఇది ఒకటో రోజ్ గార్ మేళా అని ప్రధాని పేర్కొంటూ ఎన్ డిఎ పాలన లో ఉన్న రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో రోజ్ గార్ మేళాలను క్రమం తప్పక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో లక్షల కొద్దీ కొత్త కుటుంబాలు ప్రభుత్వ కొలువుల తాలూకు అవకాశాలను అందుకొంటాయని ప్రధాన మంత్రి చెప్పారు.

‘‘క్రమం తప్పకుండా రోజ్ గార్ మేళాల ను ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రభుత్వ ముద్రగా మారిపోయింది. ఈ ప్రభుత్వం తీసుకొన్న సంకల్పం ఏదైననప్పటికీ దానిని ఆచరణ లోకి తీసుకు రావడం జరుగుతుంది అని ఈ ఈ మేళాల నిర్వహణ చాటి చెప్తోంది’’ అని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు,

 కొత్తగా నియామకం జరిగిన వ్యక్తుల ముఖాలలో సంతోషాన్ని, సంతృప్తిని తాను స్పష్టంగా చూడగలుగుతున్నానని; అంతేకాకుండా, ఈ అభ్యర్థులలో చాలా మంది సామాన్య నేపథ్యాల నుండి వచ్చిన వారేనని, అంతేకాక వారి కుటుంబాలలో వెనుకటి అయిదు తరాలలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించిన మొదటి వ్యక్తులంటూ ఎంతో మంది కూడా ఉన్నారని  మోదీ సంతోషం వ్యక్తం చేశారు

ఇది ఒక ప్రభుత్వ నౌకరీ ని చేజిక్కించుకోవడాని కంటే మిన్న అయినటువంటి విషయం అని ప్రధాన మంత్రి తెలిపారు.  పారదర్శకమైనటువంటి, స్పష్టమైనటువంటి భర్తీ ప్రక్రియ ద్వారా అభ్యర్థుల యోగ్యతకు గౌరవం లభించినందుకు కూడాను ఆనందం వ్యక్తం చేశారు.  ‘‘నియామకం ప్రక్రియలో పెద్ద ఎత్తున చోటు చేసుకొన్న మార్పును మీరు తప్పక గమనించే ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకం ప్రక్రియ మునుపటితో పోలిస్తే మరింత సరళం, కాలబద్ధం అయింది’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ప్రస్తుతం నియామకం సంబంధి ప్రక్రియ లో పారదర్శకత్వం, వేగం అనేవి ఇప్పటి ప్రభుత్వ పనితీరులో ప్రతి ఒక్క అంశానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని ప్రధాని చెప్పారు. ‘‘పారదర్శకమైనటువంటి నియామకం, పదోన్నతి అనేవి యువతీ యువకులలో ఒక భరోసాను అంకురింప చేస్తాయి’’ అని తెలిపారు.