
గ్రాండ్ ట్రంక్ రూట్లో ఉన్న నెల్లూరు రైల్వే స్టేషన్, అతి సుందరంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించేందుకై “రైల్వే స్టేషన్ల పునరాభివృద్ది ” ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. రోజురోజుకు రైలు ప్రయాణికుల వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది . ఈ స్టేషన్ నుండి రోజుకు సుమారు 30,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఒక ప్రత్యేకత కల్గిన స్టేషన్ గా గుర్తింపు పొందింది .
ప్రస్తుత, భవిష్యత్తులో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దెందుకు ఈ స్టేషన్ లో మరింత ఉన్నత స్థాయి వసతులు కల్పించేందుకు ఈ పి సి ( ఇంజినీరింగ్ ,ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ ) విధానంలో ఈ స్టేషన్ ను అభివృద్ధి పర్చేందుకు ప్రణాళికను రూపొందించారు.
నెల్లూరు స్టేషన్లో ప్రారంభమైన పునరాభివృద్ది పనులు బాగా పుంజుకున్నాయని, పనులను ప్రతి దశలోనూ పర్యవేక్షిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టామని, ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
దక్షిణ మధ్య రైల్వే ఆగస్టు 2022లో ఎస్ సి ఎల్ ఇన్ఫ్రా టెక్ లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీతో ఈ కీలకమైన పనిని చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పనులను 21 నెలల కాల వ్యవధిలో అనగా మే, 2024 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ పనులు ప్రారంభించారు. అలాగే ఇందుకు సంబందించిన పనులు పురోగతిలో వున్నాయి.
సైట్ కార్యాలయాలు, కాంక్రీట్ టెస్టింగ్ ల్యాబ్ , పనికి సంబందించిన సామగ్రిని భద్రపరిచేందుకు తాత్కాలిక షెడ్ల నిర్మాణం పూర్తయింది. నెల్లూరు రైల్వే స్టేషన్ కు సంబంధించిన ప్రధాన మార్పులు, అలాగే ఈ స్టేషన్ ను ఉన్నత స్థాయికి అభివృద్ధి పర్చేందుకు రూపొందించిన డిజైన్ ను నిర్వహణ సంస్థ ఇదివరకే ఐఐటి-మద్రాస్ అధికారులు తనిఖీ చేసి డిజైన్ ను ఆమోదించడం జరిగింది.
కోర్టు, జీఆర్పీ కార్యాలయాల తాత్కాలిక నిర్వహణ కోసం తాత్కాలిక షెడ్ల నిర్మాణం పూర్తి చేసి సంబంధిత శాఖలకు అప్పగించారు. 1వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌లో ఎనిమిది కవర్ ఓవర్ ప్లాట్ ఫారాల ( సి ఓ పి ) నిర్మాణానికి సంబందించిన దిమ్మెల నిర్మాణం, అలాగే 2వ, 4వ ప్లాట్‌ఫారమ్‌లో ఒక్కొక్కటి చొప్పున 4 దిమ్మెల నిర్మాణం పూర్తయింది. సి ఓ పి ఫాబ్రికేషన్ పనులు పురోగతిలో వున్నాయి .
అలాగే పాత కట్టడాలను కూల్చివేసి కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులకు సంబంధించి నిర్మాణ సంస్థ 250 మెట్రిక్ టన్నుల స్టీల్‌ను కొనుగోలుచేసింది .
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు