ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫోటో మార్చిన మాజీ ఎంపీ పొంగులేటి!

బిఆర్ఎస్ తొలి బహిరంగసభను ఖమ్మంలో ఈ నెల 18న జరిపేందుకు ఒక వంద ఆ పార్టీ నాయకులు భారీ సన్నాహాలు చేస్తుండగా ఆ జిల్లాలో ఆ పార్టీ కీలక నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ పార్టీ నాయకత్వంకు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. ఇటీవలనే ఆయన వ్యక్తిగత భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కుదించడంతో బిజెపిలోకి చేరుతున్నారనే కధనాలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫోటో మార్చడంతో అందుకు బలం చేకూరుతుంది.
ఇప్పటిదాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, బీఆర్‌ఎస్, కేసీఆర్ ఆర్మీ ఫొటోలను ప్రొఫైల్ పిక్‌‌గా ఉంచిన పొంగులేటి. ఇప్పుడు అవన్నీ తీసేశారు. ఈ చర్యలతో పార్టీ మార్పు ప్రచారానికి పొంగులేటి బలాన్ని ఇచ్చినట్లయింది. ఖమ్మంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ సమయంలోనే పొంగులేటి ఢిల్లీలో
బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడం రాజకీయవర్గాల్లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారని ప్రచారం జరుగుతుంది.
పొంగులేటి వస్తే పార్టీ బలోపేతం కావడంతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవచ్చని బీజేపీ నాయకత్వం సహితం భావిస్తున్నది. అందుకనే 18 నాటి సభ ఏర్పాట్లకోసం ఖమ్మం వెళ్లిన ఆర్ధిక మంత్రి హరీష్ రావు సహితం పొంగులేటిపై విమర్శలకె పరిమితమయ్యారు. ఆయనతో పాటు మద్దతుదారులు ఎవ్వరు బిజెపిలోకి వెళ్లకుండా కట్టడి చేసేందుకు గత వారం రోజులుగా అధికార పార్టీ నేతలు కష్టపడుతున్నారు.
 
మంత్రులు హారీష్ రావు, పువ్వాడ‌ అజయ్ కుమార్ ఎక్కడా పొంగులేటి పేరుఎత్తక పోయినప్పటికీ క‌మ‌లం పార్టీలో చేరడమంటే ఆత్మహత్యా సదృశ్యమే అని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ కు బలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్, టిడిపి నుండి వచ్చిన నేతలతో హవా సృష్టిస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు వారే  ఒకొక్కరు జారుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.