కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్న రైతులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. రైతులకు అన్యాయం చేసిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్, తమపై విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ ను కోరారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. ఎలాంటి సమాచారం లేకుండానే మాస్టర్ ప్లాన్ లో భాగంగా తమ భూములను లాక్కోవడం సరైన పద్ధతా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ పని చేస్తున్నారని ఆరోపించారు.
తమపై దాడికి కారణమైన జిల్లా కలెక్టర్, పోలీసులపై కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్న రైతులు వేడుకున్నారు.

More Stories
కాంగ్రెస్ ది దగా ప్రభుత్వం.. రైతుల ఆక్రందనలు వినబడట్లేదా?
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యంపై నిరసన
కాజీపేట రైల్వే యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్ల తయారీ