26వ జాతీయ యువజనోత్సవాన్ని 12న ప్రారంభించనున్న ప్రధాని

26వ జాతీయ యువజనోత్సవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్నాటకలోని హుబ్బళ్ళిలో గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. స్వామి వివేకనందుల ఆదర్శాలను, బోధనలను, వారి తోడ్పాటులను గౌరవించుకోవడం కోసం ఆయన జయంతి నాడు పాటించే ‘జాతీయ యువజన దినం’ రోజుననే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

ప్రతిభావంతులైన మన యువత కు జాతీయ స్థాయిలో అవగాహనను ఏర్పరచడంతో పాటు, దేశ నిర్మాణం దిశగా పాటుపడేటట్టు వారిని ఉత్సాహవంతులను చేయడం కోసం ప్రతి ఏటా ఈ యువజనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల విభిన్న సంస్కృతులను ఒకే వేదిక మీకు ఈ కార్యక్రమం తీసుకు రావడమే కాకుండా ఈ ఉత్సవం లో పాలుపంచుకొనే వారిని ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావనతో పెనవేస్తుంది.

ఈ సంవత్సరంలో, ఈ ఉత్సవాన్ని జనవరి 12 నుండి 16 వరకు కర్నాటక లోని హుబ్బళ్ళి-ధారవాడలలో నిర్వహిస్తున్నారు. ‘వికసిత్ యువా, వికసిత్ భారత్’ అనేది ఈ ఉత్సవానికి ఇతివృత్తంగా ఎంచుకున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా యువజన శిఖర సమ్మేళనం కొలువుదీరుతుంది. ఈ సమిట్ జి20, ఇంకా వై20ల ద్వారా స్ఫూర్తిని పొందే అయిదు ఇతివృత్తాలపై సర్వసభ్య చర్చలకు సాక్షి గా నిలుస్తుంది.

చర్చాంశాలలో పని యొక్క భవిష్యత్తు, పరిశ్రమ, నూతన ఆవిష్కరణలు, 21వ శతాబ్దిలో నైపుణ్యాలు; జలవాయు పరివర్తన, ఇంకా వైపరీత్యాల తాలూకు నష్ట భయాన్ని తగ్గించడం; శాంతిని స్థాపించడం, సర్దుబాటు చేయడం; ప్రజాస్వామ్యంలోను, పాలనలోను యువత ప్రధాన పాత్రను పోషించే ఉమ్మడి భవిష్యత్తు; ఆరోగ్యం, శ్రేయస్సు వంటివి ఉంటాయి. 60 మందికి పైగా నిపుణులు ఈ శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొంటారు.

ఈ ఉత్సవాల లో స్పర్థాత్మక కార్యక్రమాలతో పాటు పోటీకి తావు ఉండని అటువంటి కార్యక్రమాలను అనేకంగా నిర్వహిస్తారు. స్పర్ధాత్మక కార్యక్రమాలలో జానపద నృత్యాలు, లోకగీతాలు ఉంటాయి. స్థానిక సంప్రదాయాలకు ఉత్తేజాన్ని అందించేందుకు ఈ విధమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక నాన్-కాంపిటీటివ్ ఈవెంట్స్ లో భాగంగా ‘యోగథన్’ ఉంటుంది. యోగ చేసేందుకు 10 లక్షల మందిని సమీకరించాలి అనేది దీని ధ్యేయంగా ఉంది.

దేశవాళీ క్రీడలను, రణవిద్యలను ఎనిమిదింటిని జాతీయ స్థాయి ప్రదర్శనకారులు ఈ సందర్భంలో ఆవిష్కరించనున్నారు. ఇతర ఆకర్షణలలో మిగతా అంశాలతో పాటు ఆహార ఉత్సవం, యువ చిత్రకారుల శిబిరం, సాహసిక క్రీడా కార్యకలాపాలు, మీ సైన్యాన్ని, నౌకా దళాన్ని, వాయు సేనను గురించి తెలుసుకోండి అనే సందేశంతో ఏర్పాటు చేసే ప్రత్యేక శిబిరాలు వంటివి ఉంటాయి.