రెండవ బూస్టర్‌ అవసరం లేదు

చైనాలో కొత్తవేరియంట్‌ బీఎఫ్‌7 కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. నాల్గవ వేవ్‌ పరిణామాలను నిశితంగా పరిశీ లిస్తోంది. కొత్త వేరియంట్ల వ్యాప్తిపై నిఘా ఉంచింది. మరోవైపు బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది. దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది.
 
 అయితే, కరోనా ముప్పు ఉన్నప్పటికీ రెండవ బూస్టర్‌ డోస్‌ మాత్రం అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా నిరోధానికి బూస్టర్‌ డ్రైవ్‌ను పూర్తి చేయడం ప్రభుత్వ మొదటి లక్ష్యం అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  కరోనా పరిస్థితిని ఎదుర్కోవటానికి భారతదేశం తన సన్నాహాలను వేగవంతం చేస్తోంది.
 
కొత్త కరోనా వేరియంట్‌ల భయాలు పెరిగినందున చైనా నుంచి వచ్చే ప్రయాణికుల కోసం మరిన్ని దేశాలు ప్రయాణ పరిమితులు విధిస్తున్నాయి. చైనా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు భారతీయ విమానాశ్రయంలో దిగడానికి ముందు కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది.
 
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గత 24 గంటల్లో 134 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కింద ఇప్పటివరకు మొత్తం 220.11 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు అందించారు.
 
ఇలా ఉండగా, అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి కారణమైన కరోనా ఎక్స్‌బిబి 1.5 వేరియంట్ కేసులు భారత్‌లో నమోదయ్యాయని ఇన్సకాగ్ ( ఇండియన్ సార్స్ కొవి 2 జీనోమిక్స్ కన్సార్టియమ్ ( ఇన్సకాగ్) డేటా వెల్లడించింది. ఈ ఐదు కేసుల్లో మూడు గుజరాత్‌లో, కర్ణాటక, రాజస్థాన్‌ల్లో ఒక్కొక్కటి వంతున బయటపడ్డాయని మంగళవారం వివరించింది. ఎక్స్‌బిబి వేరియంట్… ఒమిక్రాన్ ఎక్స్‌బిబి వేరియంట్‌కు సంబంధించింది.ఒమిక్రాన్ బిఎ. 2జ 10.1, బిఎ .2.75 సబ్‌వేరియంట్ల తిరిగి స మ్మేళనం కావడం వల్ల ఇది ఏర్పడింది. ఎక్స్‌బిబి, ఎక్స్‌బిబి 1.5 ఈ రెండూ కలయికతో అమెరికాలో మొత్తం కేసుల్లో 44 శాతం వర కు ఇవి వ్యాపించాయి. కొవిడ్ 19 వేరియం ట్ ఒమిక్రాన్, దాని ఉపవేరియంట్లు ఎక్స్‌బిబితో కలిసి భారత్‌లో విపరీతంగా విజృంభిస్తున్నాయని ఇన్సకాగ్ వివరించింది.