శ్రీకృష్ణ జన్మభూమిలోని షాహీ ఈద్గా మసీదుపై సర్వే

శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం విషయంలో ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా కోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. హిందువులు అత్యంత భక్తిభావంతో పూజించే శ్రీకృష్ణుడి జన్మస్థలంలో  నిర్మించిన షాహి ఈద్గా మసీదుకు  సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనవరి 2 తర్వాత సర్వేను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. నివేదికను జనవరి 20,2023 కల్లా సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
 
 హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్త పిటిషన్‌ను విచారించిన కోర్టు..ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కాగా,జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాల తరహాలోనే మధుర కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. వీడియోగ్రాఫిక్ సర్వే నిర్వహించాలని జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
 
మధురలోని  శ్రీకృష్ణ జన్మస్థలంగా భావిస్తున్న 13.37 ఎకరాల భూ యాజమాన్య హక్కులపై వివాదం మొదలైంది. అందువల్ల శ్రీకృష్ణ జన్మస్థలంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో క్రీస్తుశకం 17వ శతాబ్ధంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్  మసీదును నిర్మించారని హిందూ సంఘాలు చెబుతున్నాయి. 
 
ఇది జరిగిన వందేళ్ల తర్వాత యుద్ధంలో మరాఠాలు విజయం సాధించి మథుర, ఆగ్రాలను స్వాధీనం చేసుకున్నారని.. అనంతరం మసీదును తొలగించి శ్రీకృష్ణుడి ఆలయాన్ని పునరుద్దరించారు అని పేర్కొన్నారు. అయితే 1969లో శ్రీకృష్ణ జన్మస్థానం సేవా సంఘం, ఆలయ నిర్వాహణ కమిటీ, షాహీ ఈద్గా మసీదు మధ్య ఓ ఒప్పందం జరిగింది. 
 
దీని ప్రకారం.. ఈద్గాకు స్థలాన్ని ఇచ్చేందుకు ఆలయ కమిటీ అంగీకరించింది. కానీ ఈ ఒప్పందం సరికాదని తాజాగా హిందూ సంఘాలు కోర్టులో పిటిషన్ వేశాయి. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్, షాహీ ఈద్గా మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. అది అక్రమ ఒప్పందం అని పిటిషన్‌లో పేర్కొన్నారు. షాహీ ఈద్గాను స్వాధీనం చేసుకుని ఆ నిర్మాణాన్ని కూలగొట్టాలని పిటిషన్‌లో కోరారు పిటిషనర్.
మధురలోని  శ్రీకృష్ణ జన్మస్థలంగా భావిస్తున్న 13.37 ఎకరాల భూ యాజమాన్య హక్కులపై వివాదం మొదలైంది. అందువల్ల శ్రీకృష్ణ జన్మస్థలంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో క్రీస్తుశకం 17వ శతాబ్ధంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్  మసీదును నిర్మించారని హిందూ సంఘాలు చెబుతున్నాయి.
ఇది జరిగిన వందేళ్ల తర్వాత యుద్ధంలో మరాఠాలు విజయం సాధించి మథుర, ఆగ్రాలను స్వాధీనం చేసుకున్నారని.. అనంతరం మసీదును తొలగించి శ్రీకృష్ణుడి ఆలయాన్ని పునరుద్దరించారు అని పేర్కొన్నారు. అయితే 1969లో శ్రీకృష్ణ జన్మస్థానం సేవా సంఘం, ఆలయ నిర్వాహణ కమిటీ, షాహీ ఈద్గా మసీదు మధ్య ఓ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం.. ఈద్గాకు స్థలాన్ని ఇచ్చేందుకు ఆలయ కమిటీ అంగీకరించింది.
కానీ ఈ ఒప్పందం సరికాదని తాజాగా హిందూ సంఘాలు కోర్టులో పిటిషన్ వేశాయి. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్, షాహీ ఈద్గా మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. అది అక్రమ ఒప్పందం అని పిటిషన్‌లో పేర్కొన్నారు. షాహీ ఈద్గాను స్వాధీనం చేసుకుని ఆ నిర్మాణాన్ని కూలగొట్టాలని పిటిషన్‌లో కోరారు పిటిషనర్.