ద్వారకా కారిడార్ ప్రాంతంలో ప్రపంచంలోనే ఎత్తైన కృష్ణుడి విగ్రహం

అయోధ్య రామమందిరం నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తుండగా,  కేంద్ర ప్రభుత్వం తాజాగా గుజరాత్ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ద్వారకా జిల్లాలోని దేవభూమి ద్వారకా కారిడార్ ప్రాంతంలో భారీ కృష్ణుడి విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హృషికేష్ పటేల్ తెలిపారు.
 
 ప్రపంచంలోనే ఎత్తైన కృష్ణుడి విగ్రహానికి సంబంధించిన మొదటి దశ పనులు 2023 సెప్టెంబర్ లో కృష్ణాష్టమి రోజు నుండి ప్రారంభించాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హృషికేష్ పటేల్ వివరించారు. దేవభూమి ద్వారకా కారిడార్లో ద్వారకాధీష్ ఆలయంలో త్రీడీ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ జోన్  శ్రీమద్ భగవద్గీత అనుభవ క్షేత్రాన్ని సైతం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
గుజరాత్ లోని పలు ఆధ్యాత్మిక కేంద్రాలకు దేవ భూమి ద్వారకా కారిడార్ కి నిలయంగా మార్చడం ద్వారా పశ్చిమ భారతదేశంలోనే ఈ క్షేత్రం అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ అతిపెద్ద కృష్ణుడి విగ్రహానికి సంబంధించిన పనులు చేపడుతామని తెలిపారు.
ఈ ప్రాజెక్టు మొదటి దశలో పురాతన ద్వారక నగరానికి సంబంధించిన అవశేషాలను ప్రజలు తిలకించేలా గ్యాలరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని ఆయన తెలిపారు. `గుజరాత్ లో ఆధ్యాత్మికతను పునరేకెక్తిస్తాం’ అంటూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి తన ఎన్నికల మానిఫెస్టోలో చేసిన హామీల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ హామీలో భాగంగా, సోమనాథ్, అంబాజీ, పావగఢ్ లవలె రాష్ట్రంలో దేవాలయాలను పునరుద్ధరించి,  విస్తరించి, అభివృద్ధి చేసేందుకు రూ 1,000 కోట్లు ఖర్చుపెడతాము’ అని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పునరుద్దరించే 16 దేవాలయాలను పేర్కొన్నారు. భావనగర్ వద్ద గల సిహోర్ ను `చోటా కాశి గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 
సంస్కృతి.. సంప్రదాయాలకు నిలయంగా భారత్ గుర్తింపు పొందుతున్నది.  విదేశీయులు సైతం మన సంప్రదాయాలకు ముగ్ధులై మనల్ని అనుసరించేందుకు  ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా భారత్ కు వచ్చే పర్యాటకులకు మనదేశంలోని ఆధ్యాత్మిక ఆలయాలు, ఇతర ప్రాంతాలను చూసేందుకు మక్కువ చూపుతుంటారనే సంగతి తెలిసిందే.