
అయ్యప్ప మాలలో ఉండి అబద్దాలు చెప్పడం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే చెల్లిందని బిజెపి ఎమ్మెల్యే ఎన్ రఘునందన్ రావు విమర్శించారు. హిందూ మతాన్ని, ధర్మాన్ని తాము నమ్ముతామని, భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికొస్తే నిజాలు మాట్లాడుతాడనుకున్నామని స్పష్టం చేశారు.
తనపై చేసిన ఆరోపణలను కొట్టిపారేస్తూ దొరల కాంపౌండ్ లోనే చేరి ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నవ్ రోహిత్ అంటూ ఎద్దేవా చేశారు. ప్రగతిభవన్ లో కొత్తగా చేరిన చిలుకలా పైలట్ చిలకపలుకులు పలుకుతున్నారని విమర్శించారు.
2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన రోహిత్ రెడ్డి.. ప్రచారంలో ‘అన్నం పెట్టే చేయి కావాలా? లేక దొరలు తిరిగే కారు కావాలా?’ అని ప్రజలను ప్రశ్నించారని గుర్తుచేశారు. దీనికి సంబంధించిన వీడియోను మీడియాకు చూపించారు. ‘అన్నం తినిపించిన పార్టీకి సున్నం పెట్టినవ్.. బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గోదావరిలో ముంచినవ్.. ” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్హత విషయంలో తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని తాను అడిగితే, ఆ విషయం పక్కన పెట్టి, సంబంధం లేని వాటి గురించి మాట్లాడారని ధ్వజమెత్తారు. రోహిత్ రెడ్డికి రాష్ట్రంతో గానీ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని పేర్కొంటూ తెలంగాణ వచ్చాక అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యే అయిన ఆయన తన గురించి కామెంట్లు చేస్తున్నాడని మండిపడ్డారు.
తాను ఏ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్నానో వీడియో ఫుటేజీలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. అయ్యప్ప మాలలో ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో ఇంతకంటే ఏం మాట్లాడలేకపోతున్నానని చెప్పారు
తాను అక్రమంగా సంపాదించి ఉంటే, ఇల్లీగల్ పనులు చేసుంటే.. ప్రగతి భవన్ గానీ, సీఎం ఆఫీస్ గానీ ఈ రోజు దాకా ఎందుకు విచారణ జరిపించలేకపోయిందని నిలదీశారు. తానే తప్పూ చేయనందునే సీఎం కూడా చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డది కేసీఆర్, పట్నం మహేందర్ రెడ్డి కుటుంబాలేనన్న రఘునందన్ రావు.. దమ్ముంటే 2013లో తనపై చేసిన ఆరోపణలను ఎప్పుడు రుజువు చేస్తరో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పన్ పల్లి భూములకు, రోహిత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేనట్టయితే చీఫ్ సెక్రటరీకి లేఖ రాయమని సవాల్ చేశారు.
జమిలి ఎన్నికలు జరిగితే సీఎం కేసీఆర్కు ఇబ్బంది
కాగా, జమిలి ఎన్నికలు జరిగితే సీఎం కేసీఆర్కు ఇబ్బంది ఏర్పడుతుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. అందుకనే, అవి జరగకుండా ఆలోచిస్తూ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని సీఎం కేసీఆర్ లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికలు 2018 డిసెంబర్ 7 జరిగాయని, అవి జరిగి నాలుగేండ్లు పూర్తైందని గుర్తు చేశారు.
బీజేపీ బలం డబ్బులు కాదని, కార్యకర్తలేనని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో టెక్నికల్గా గెలిచింది టీఆర్ఎస్ అయినా.. ఓట్ల శాతంలో బీజేపీనే గెలిచిందని పేర్కొన్నారు. కార్
జనవరి 7న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రతి బూత్ కమిటీ బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ ను గద్దె దించాలని ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నిక నుండి పంచాయతీ ఎన్నిక వరకు గెలవాలంటే బూత్ కమిటీ ద్వారానే సాధ్యమవుతుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
More Stories
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!
ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం ఆనవాళ్లు