బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. 2002వ సంవత్సరంలో సామూహిక అత్యాచారం చేసి, కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన 11 మందిని త్వరగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శనివారం కొట్టివేసింది. 
 
ఈ కేసులో 11 మంది నిందితులు 2008లో దోషులుగా తేలారు. దీంతో వారికి కోర్టు జీవితఖైదు విధించింది. ఈ కేసులో 2008లో దోషులుగా తేలిన 11 మంది వ్యక్తులు ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుంచి బయటికి వచ్చారు. గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ప్రకారం వారిని విడుదల చేయడానికి కోర్టు అనుమతించింది. దీనిపై బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
 
.ముందస్తు విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లకు ప్రతిస్పందనగా గుజరాత్ ప్రభుత్వం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. 11 మంది దోషుల సత్ప్రవర్తనపై 14 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత విడుదలయ్యారని తెలియజేస్తూ సుప్రీంకి గుజరాత్ సర్కారు అఫిడవిట్ దాఖలు చేసింది.