మూసీ, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వజ్రాల నిల్వలు

మూసీ పరివాహక ప్రాంతం, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వజ్రాల జోన్లు 36 ఉన్నట్లు భూగర్భ పరిశోధకులు, విశవిద్యాలయాల అధ్యయనం, పురావస్తు శాఖ పరిశోధనల్లో వెలుగు చూసింది. కృష్ణమ్మ పరుగుల కింద మిళమిళ మెరిసే వజ్రాల గనులు ఉన్నట్లు జియోలాజికల్‌ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

గత రెండు సంవత్సరాలుగా దశవారిగా సరేలు, భూగర్భ పరిశోధనలు చేసిన నిపుణులు అనేక అంశాలను కనుగొన్నారు. తెలంగాణలో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నాణ్యమైన వజ్రాలు ఉన్నాయని నివేదికల్లో పొందుపర్చారు. 400 సవత్సరాల భూగర్భ డేటాను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కృష్ణా ప్రవహించే నల్లమల అడవుల ప్రాంతాల్లో జరిపిన సరేలో అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు బహిర్గతమైంది. ఇందులో మహబూబ్‌నగర్‌ జిల్లా లింగాల మండలాన్ని ఆనుకుని ఉండే నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో నాణ్యమైన వజ్రనిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్‌ శాస్త్రవేత్తలు నిర్దారించారు.

వజ్రాలతో పాటు బంగారం ముడి ఖనిజాలు అమితంగా ఉన్నట్లు వెల్లడైంది. 400ల సంవత్సరాల క్రితమే గోల్కొండ రాజులు ఈ ప్రాంతాల్లో వజ్రాల కోసం గనులు తవ్వినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆ గనుల ఆనవాళ్లు మాత్రమే లభిస్తున్నాయి.

భారతదేశాన్ని పాలించిన అనేక మంది రాజులు తమ సంపదలో అత్యంత విలువైన వజ్రాలను కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచే సేకరించినట్లు చరిత్ర ఆధారాలున్నాయి. సంచుల్లో వజ్రాలను కొలిచే గోల్కొండ రాజులు, అంగట్లో వజ్రాలు అమ్మిన విజయనగర రాజులు, విదేశాలకు వజ్రాలను ఎగుమతి చేసిన కాకతీయ రాజులు ఏలిన తెలుగు ప్రాంతాల్లో భూగర్భ నిధి నిక్షేపాలకు కొదవలేదని స్పష్టం అవుతుంది. 

ఆనాటి రాజులు వజ్రాలను సేకరించిన గనులు మాత్రం కాలగమనంలో కలిసిపోయినా చరిత్రకారులు వాటి అనేషణలో నిమగ్నమై ఆనాటి వజ్ర గనులతో పాటు నూతనంగా నదీ పరివాహక ప్రాంతాల్లో వజ్రాల గనులు ఉన్నట్లు శాస్త్రీయ పరిశోధనల్లో వెలుగు చూస్తున్నాయి. 

ముఖ్యంగా  భీమా, తుంగభద్ర, మూసి నదులు కృష్ణ నదిలో కలిసే ప్రదేశంలో వజ్రాల నిల్వలు ఉండవచ్చని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కోహినూర్ వజ్రంతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ వజ్రాలు కృష్ణ నది పరివాహక ప్రాంతం నుండే రావడం గమనార్హం. ప్రపంచంలోని మొట్టమొదటి వజ్రాలు సహితం ఈ ప్రాంతం నుండే వచ్చాయని పరిశోధకులు చెబుతున్నారు.