ఆరోగ్య సేవలు విస్తరించాలనే యుహెచ్ఐ 

దేశంలో వైద్య సేవలను విస్తరించి, మార్కెట్ పరిస్థితులను నియంత్రించేందుకు ‘భారతదేశంలో ఏకీకృత ఆరోగ్య విధానం (యుహెచ్ఐ) పై నిర్వహించిన అధ్యయనం  నివేదికపై  జాతీయ ఆరోగ్య సంస్థ అభిప్రాయాలను ఆహ్వానించింది. ఆరోగ్య సేవల మధ్య సమన్వయం సాధించడానికి, సేవల విస్తరణకు సంబంధించిన జాతీయ ఆరోగ్య సంస్థ  మార్గదర్శకాలు సిద్ధం చేసింది.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు జరుగుతుంది.  ఏకీకృత ఆరోగ్య విధానంలో వివిధ అంశాలు, వీటిపై మార్కెట్ పరిస్థితులు చూపే ప్రభావంపై జాతీయ ఆరోగ్య సంస్థ అధ్యయనం నిర్వహించింది.

నిష్పక్షపాతంగా, పారదర్శకంగా తనిఖీలు, ఆవిష్కరణలు జరిగేలా చూడడం, చెల్లింపులు, పరిష్కారాలు, రద్దు, రీషెడ్యూలింగ్‌, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లాంటి అంశాలపై అధ్యయనం జరిగింది. ప్రతి అంశంపై సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు  నిర్దిష్ట బహిరంగ ప్రశ్నలు ఉంటాయి.

వీటికి సమాధానం ఇచ్చి సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఏకీకృత ఆరోగ్య విధానం సక్రమంగా అమలు జరిగి, సంప్రదింపులు సక్రమంగా జరిగేలా చూడాలన్న లక్ష్యంతో ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవాలని జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది.

అధ్యయన నివేదిక ప్రాధాన్యతను జాతీయ ఆరోగ్య సంస్థ సీఈవో డాక్టర్ ఆర్.ఎస్.శర్మ వివరించారు. ‘ఏకీకృత ఆరోగ్య విధానం దేశంలో వైద్య సేవల మధ్య సమన్వయం సాధిస్తుంది. వివిధ వర్గాల సహకారం, భాగస్వామ్యంతో ఏకీకృత ఆరోగ్య విధానం అమలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏకీకృత ఆరోగ్య విధానం ఏ విధంగా అమలు జరుగుతుంది, పారదర్శకంగా, సమర్ధంగా ఈ విధంగా అమలు చేయాలి అన్న అంశాలపై సంబంధిత వర్గాల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉంది.

దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టంగా అమలు చేయడం, వ్యవస్థ అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం అమలు చేయాల్సిన చారలు తదితర అంశాలపై అన్ని వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని డాక్టర్ శర్మ పేర్కొన్నారు.

అధ్యయన నివేదిక ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వెబ్‌సైట్‌  https://abdm.gov.in/publicationsలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.  2023 జనవరి 13 శుక్రవారం   వరకు  వ్యాఖ్యలు , అభిప్రాయాలను  – https://abdm.gov.in/operationalising-uhi-consultation-form . ద్వారా   సమర్పించవచ్చు