మోదీ పాలనలో రూ.1.25 లక్షల కోట్ల నల్లధనం స్వాధీనం

నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ ప్రభుత్వ సుపరిపాలన నమూనాలో పారదర్శకత ఒక ముఖ్యమైన అంశమని ఆయన పేర్కొన్నారు. 

మోదీ ప్రభుత్వ హయాంలో పారదర్శకత కోసం దాదాపు రూ.4,300 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌తో పాటు 1.75 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేశామని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రధాని తన సుదీర్ఘ ప్రజాసేవలో గుజరాత్‌లో ప్రారంభమైన సుపరిపాలన నమూనాపై పట్టు సాధించారని తెలిపారు. ఇప్పుడు అదే గుజరాత్ నమూనాను జాతీయ స్థాయిలో అమలు చేస్తున్నారని చెప్పారు.

దాదాపు 1.75 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేశామని, దాదాపు రూ.1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నామని, రూ.4,300 కోట్ల విలువైన బినామీ ఆస్తులను కూడా అటాచ్ చేశామని మంత్రి వివరించారు. దీన్ని నిర్ధారించడానికి, ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించింది. యూనిఫైడ్ పేమెంట్స్ సిస్టమ్‌ను (యుపిఇ) ప్రవేశపెట్టింది.

ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి పంపితే కేవలం 15 పైసలు మాత్రమే క్షేత్రస్థాయికి చేరుతుందని రాజీవ్ గాంధీ ఎప్పుడో చెప్పారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. అయితే ఇప్పుడు అది గతంలా మారిందని తెలిపారు. పారదర్శకత కోసం మోదీ ప్రభుత్వం 45 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలను ప్రారంభించిందని మంత్రి అశ్విని వైష్ణవ్ పేరోన్నారు.

వాటి సాయంతో రూ. 26 లక్షల కోట్లను లబ్ధిదారులకు పంపించామని కేంద్ర మంత్రి వివరించారు. ఈ విధంగా రూ.2.2 లక్షల కోట్ల లీకేజీని నిరోధించగలిగారు. స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం పారదర్శక విధానాన్ని అవలంభించి రూ.4.64 లక్షల కోట్లు వసూలు చేసి రికార్డు స్థాయిలో 778 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిందని చెప్పారు.