దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం వారిపై కఠిన చర్యలకు పూనుకున్నది. వారిద్దరినీ ప్రజల మధ్య కాల్చి చంపాలని దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ పోలీసులను ఆదేశించాడు. ఈ ఇద్దరు విద్యార్థులు 15-16 ఏండ్ల వయసు వారు. వీరిద్దర్నీ హెసాన్ నగరంలో జనం చూస్తుండగానే బహిరంగంగా పోలీసులు కాల్చి చంపారు.
నిజానికి ఉత్తర కొరియా-దక్షిణ కొరియా దేశాల మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్నవి. దాంతో ఉత్తర కొరియా ప్రజలు దక్షిణ కొరియాలో జరిగే షోలు, సినిమాలను చూడలేకపోతున్నారు. ఈ ఘటన అక్టోబర్ నెలలో జరగ్గా ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని బ్రిటిష్ పత్రిక ది ఇండిపెండెంట్ తన కథనంలో తెలిపింది.
కిమ్ జోంగ్ ఉన్న చేష్టలకు అక్కడి ప్రజలు ఎందరో బలవుతున్నారు. తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ జయంతి సందర్భంగా తాను చెప్పినట్లు నడుచుకోలేదన్న కోపంతో వందలాది మందిని మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ వద్ద 30 నిమిషాలు నిలబెట్టి తన నియంత లక్షణాలను చాటుకున్నారు.

More Stories
హర్మూజ్ దాటిన తొలి భారత ఎల్పీజీ ట్యాంకర్ జగ్ విక్రమ్
ఆర్టెమిస్-2 వెనుక భారతీయ సంతతి శాస్తస్రవేత్త అమిత్ క్షత్రియా
చంద్రుడిని చుట్టి భూమికి చేరిన ఆర్టెమిస్-2 వ్యోమగాములు