పంట నష్టంపై పిఎంఎఫ్‌బివై కింద సమగ్ర బీమా కవరేజీ

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) కింద నివారించలేని సహజ ప్రమాదాల కారణంగా సంభవించే పంట నష్టానికి సమగ్ర బీమా కవరేజీని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. పిఎంఎఫ్‌బివై అనేది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పంటల బీమా పథకం.
 
ఈ పథకం కింద ప్రతి సంవత్సరం సుమారు 5 కోట్ల మంది రైతుల దరఖాస్తులు అందుకుంటున్నందున రాబోయే సంవత్సరాల్లో ఇది నంబర్ వన్ అవుతుంది. 2016లో పథకం ప్రారంభించినప్పటి నుండి రుణం పొందే రైతులు, సన్నకారు రైతులు, చిన్న రైతుల వాటా 282% పెరగడంతో, గత 6 సంవత్సరాలలో ఈ పథకం ఆమోదయోగ్యత రైతులలో పెరిగింది.

గత 6 సంవత్సరాల్లో రైతులు రూ. 25,186 కోట్లు ప్రీమియంగా చెల్లించారు. ఇందులో 31 అక్టోబర్, 2022 నాటికి రైతుల క్లెయిమ్‌లకు ప్రతిఫలంగా రూూ.1,25,662 కోట్లు చెల్లించబడ్డాయి, ఈ పథకం కింద ఎక్కువ ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. పథకం అమలులో ఉన్న రాష్ట్రాల్లోని రైతులు రబీ 22-23 నమోదుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో  మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లోని రైతులకు చాలా తక్కువ మొత్తంలో బీమా క్లెయిమ్‌లు చెల్లిస్తున్నారని  కొన్ని మీడియా విభాగాలలో వాస్తవ విరుద్ధ కధనాలు వచ్చాయి.

వార్తా అంశంలో నివేదించిన కేసులను పరిశీలించడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నించింది. అయితే నిర్దిష్ట డేటా పాయింట్లు లేకపోవడంతో ఒక రైతును మాత్రమే గుర్తించగలిగింది. పాడురంగ్‌ భాస్కర్ రావు కదం అనే రైతు మొత్తం ప్రీమియంగా రూ.595 చెల్లించగా.. ఒక పంటకు రూ.37.31, మరో పంటకు రూ.327 పరిహారంగా క్లెయిమ్‌ పొందినట్లు వార్తల్లో కథనాలు వచ్చాయి.

 కానీ వాస్తవ క్లెయిమ్ డేటా ప్రకారం ఇప్పటి వరకు అతను చెల్లించిన ప్రీమియంకు దాదాపు నాలుగు రెట్లు మొత్తం అంటే రూ.2080.40 క్లెయిమ్ మొత్తాన్ని అందుకున్నాడు.రూ. 2080.40 కూడా పాక్షిక చెల్లింపు మాత్రమే. క్లెయిమ్‌ల తుది సెటిల్‌మెంట్ పూర్తయిన తర్వాత పాండురంగ్ రావు మరింత డబ్బు పొందవచ్చు. 
 
 అలాగే పర్భానీ జిల్లాలో కొందరు రైతులకు రూ. 50,000 క్లైయిమ్‌లు అందగా ఓ రైతుకు జిల్లా క్లెయిమ్‌ల తుది పరిష్కారానికి ముందు రూ.94,534 అందుకున్నారు. పర్బానీ జిల్లాలో 6.66 లక్షల రైతు దరఖాస్తులు అందగా అందులో రైతులు రూ.48.11 కోట్ల ప్రీమియం చెల్లించారు. 
 
ఇప్పటి వరకు రూ.113 కోట్ల క్లెయిమ్‌లు చెల్లించారు. అయితే, రూ.1000/- కంటే తక్కువ క్లెయిమ్ ఉన్న రైతులకు తుది సెటిల్‌మెంట్ సమయంలో ఏదైనా క్లెయిమ్ వచ్చినట్లయితే కనీసం రూ.1000/- వ్యక్తిగత రైతుకు చెల్లించాలనే షరతుతో చెల్లిస్తారు.  మహారాష్ట్ర ప్రభుత్వం 79.53 లక్షల దరఖాస్తుల్లో ఖరీఫ్-22లో రాష్ట్రంలో దాదాపు 283 దరఖాస్తులు రూ.100/- లోపు బీమా చేసినవి కాగా, 21,603 దరఖాస్తులు రూ.1000/- కంటే తక్కువ బీమా మొత్తాన్ని కలిగి ఉన్నాయి. 
 
 కొన్ని సందర్భాల్లో, బీమా చేసిన వారి ప్రాంతం చాలా తక్కువగా ఉన్నందున మొత్తం క్లెయిమ్ తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఒక రైతుకు కనీసం రూ.1000/- క్లెయిమ్ చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే చిన్న రైతులతో సహా రైతులు ఖరీఫ్‌కు గరిష్టంగా 2%, రబీ ఆహార, నూనెగింజల పంటలకు 1.5%, వాణిజ్య/ఉద్యాన పంటలకు 5% చెల్లించాలి. 
 
ఖరీఫ్ 2020 నుండి 90:10 ఈశాన్య ప్రాంతంలో మినహా ఈ పరిమితుల కంటే ఎక్కువ ప్రీమియం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50: 50 ప్రాతిపదికన పంచుకుంటాయి.  ఖచ్చితమైన వ్యవసాయంతో పిఎంఎఫ్‌బివై పరిధిని, కార్యకలాపాలను పెంచడంలో డిజిటలైజేషన్, టెక్నాలజీ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఉన్నత అధికారి తెలిపారు. అగ్రి టెక్,  రూరల్ ఇన్సూరెన్స్ యూనియన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు మ్యాజిక్ ఫార్ములాగా ఉంటుంది. ఇది పథకంపై నమ్మకాన్ని కలిగిస్తుంది.

ఇటీవల ప్రవేశపెట్టిన వాతావరణ సమాచారం, నెట్‌వర్క్ డేటా సిస్టమ్స్ (విండ్స్) టెక్నాలజీ ఆధారంగా దిగుబడి అంచనా వ్యవస్థ (యెస్‌-టెక్‌), నిజ సమయ పరిశీలనల సేకరణ, పంటల ఫోటోగ్రాఫ్‌లు (క్రాప్‌పిక్‌) వంటి చర్యలు పథకంలో మరింత సమర్థత, పారదర్శకతను తీసుకురావడానికి తీసుకున్న కొన్ని కీలక చర్యలు. రైతుల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఛత్తీస్‌గఢ్‌లో ఒక సమగ్ర హెల్ప్ లైన్ సిస్టమ్ బీటా పరీక్షలో ఉంది.