అధికారి గల్లా పట్టుకొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

జోగులాంబ జిల్లా గద్వాలలో ఓ జిల్లా స్థాయి అధికారి గల్లా పట్టుకొని ఆయనపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో పాటు జడ్పీ చైర్ పర్సన్ సరితను అధికారులు ఆహ్వానించారు

అయితే ఎమ్మెల్యే రాకముందే జడ్పీ చైర్ పర్సన్ గురుకుల స్కూల్ ను ప్రారంభించారు.   దీంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి  ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక ప్రిన్సిపాల్ గల్లా పట్టుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. ఎ . అక్కడే ఉన్న  ఓ  అధికారి గల్లా పట్టుకొని  తాను రాకముందే స్కూల్ ను ఎలా ప్రారంభిస్తారంటూ బూతులు తిట్టారు.

ఎమ్మెల్యే తీరుతో అక్కడే ఉన్న అధికారులు విస్తుపోయారు. గత కొద్దీ రోజులుగా గద్వాల టీఆర్ఎస్ నేతల మధ్య వర్గ పోరు ఎక్కువైంది. జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేల గ్రూపుల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి. ఆధిపత్యం కోసం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

ఎమ్మెల్యే‌పై కేసు నమోదు చేయాలి

ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై దాడి చేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. గద్వాల నియోజకవర్గం‌లోని బీసీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన దాడి ఘటనపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్ మధ్య ఉన్న విభేదాల కారణంగా బాధ్యతాయుత ప్రిన్సిపాల్‌పై దాడి చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెంటనే ప్రిన్సిపాల్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే‌పై పోలీసులు కేసు నమోదు చేయకుంటే ఆందోళనలు చేపడతామని  ఆమె  హెచ్చరించారు.