మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

 
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసాలపైపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఒకేసారి 50 బృందాలతో దాడులు కొనసాగిస్తున్నారు. మంగళవారం  తెల్లవారుజాము నుంచి దాడులు చేస్తున్నారు.  మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసులు, యూనివర్సిటీ, మల్లా రెడ్డి కాలేజీల్లో సోదాలు జరుగుతున్నాయి. 
సికింద్రాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్న ఆయన ఇల్లు, ఇతర కార్యాలయాలలో తనిఖీలు అధికారులు ప్రారంభించారు. మల్లారెడ్డి కాలేజీలకు కుమారుడు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆర్థిక లావాదేవీలపై కూడా ఐటీ శాఖ అధికారులు నజర్ పెట్టారు. మహేందర్ రెడ్డి తో పాటు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి నివాసంలో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.
 
రంగారెడ్డి జిల్లాలోని మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో  ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. రంగారెడ్డి , హైదరాబాద్ ఇరు జిల్లాల్లో మొత్తం 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది.  మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో అలాగే మల్లారెడ్డి కూతురు కొడుకు, అల్లుడి నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో మొత్తం 50 బృందాలు పాల్గొన్నట్లు తెలుస్తుంది. 
 
మహేందర్ రెడ్డి కొంపల్లిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు మహేందర్ రెడ్డి. మైసమ్మగూడ, మేడ్చల్ ప్రాంతాల్లో విస్తరించి వున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.  మల్లా రెడ్డి యూనివర్సిటీ ,మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలో సోదాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు.
పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా  రాజశేఖర్ రెడ్డి,  మహేందర్ రెడ్డి పెట్టుబడి పెట్టారు. కాలేజీలు రియల్ ఎస్టేట్ రంగాల్లో మొత్తాన్ని కూడా డైరెక్టర్ గా మల్లారెడ్డి అల్లుడు, కుమారుడు ఉన్నారు. కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలో ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
మంత్రి మల్లారెడ్డి కి చెందిన కండ్లకోయాలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలజీల్లో  ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ బృందాలు ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నట్లు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లలో ఐటి అధికారుల దాడులు కొనసాగాయి.
మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలోని పలుప్రాంతాలలో అధికారులు పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. యూనివర్శిటీతో కలిపి 38 ఇంజనీరింగ్ కాలేజీలు మల్లారెడ్డికి ఉన్నాయి. మెడికల్ కాలేజీలు రెండు నారాయణ హృదయాలయ, మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు.. మొత్తం 6కు పైగా పాఠశాలలు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు, దేవరాంజల్, షామీర్ పేట్, జవహర్ నగర్‌, మేడ్చల్, ఘట్కేసర్, కీసరలో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.