హిందువు అంటూ స్నేహం చేసిన వ్యక్తి అరెస్ట్

తన మతాన్ని దాపెట్టి, బూటకపు ఐడెంటీటితో సోషల్ మీడియా ద్వారా హిందూ యువతితో స్నేహం చేసిన 50 ఏళ్ల ముస్లిం వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కథారా ప్రాంతానికి చెందిన బిధ్నుకు చెందిన షహెన్‌షా ఆలం కొన్ని నెలల క్రితం ఫేస్‌బుక్ ద్వారా ఓ యువతితో స్నేహం చేశాడు. 
 
ఆమెను పెళ్లి చేసుకుంటానని, కాన్పూర్‌లో ఆమె ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెకు దగ్గరయ్యాడు. ఆ యువతి ఆదివారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అతడు తన మతాన్ని దాపెట్టి తనతో సంబంధం పెట్టుకున్నాడని పేర్కొంది.
 
షెహన్‌షా ఆలమ్ ఆమెను శనివారం బీహార్ నుంచి కోపర్‌గంజ్ ప్రాంతంలో ఓ హోటల్ రూమ్‌లోకి రప్పించుకుని లోబరచుకున్నాడు. అతడు తన వయస్సు వగైరా దాపెట్టి లోబరుచుకున్నాడని గ్రహించి గోల చేసింది. హోటల్ సిబ్బంది వెంటనే 112 కు డయల్ చేసి పోలీసులకు తెలిపారు. 
 
భజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కలెక్టర్‌గంజ్ ఏసిపి టిబి సింగ్ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. షెహన్‌షా ఆలం బిధ్ను కు చెందిన ఖథార పట్టణానికి చెందిన వాడని, ఆ యువతి బీహార్‌లోని మోతీహారీ జిల్లాకు చెందిందని తెలిపారు.

మూడు నెలల క్రితం అతడు తనను తాను సచిన్ శర్మ అని ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని స్నేహం చేశాడని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. ఐపిసి 354(బలాత్కారం), 506(నేరపూరిత బెదిరింపు), తదితర ఐటి సెక్షన్ల కింద అతడిపై కేసు బుక్‌చేసినట్లు ఏసిపి తెలిపారు.