15న భద్రాచలం గోశాల సందర్శనకు వి హెచ్ పి నేత

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం గోశాలను విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వి. సురేందర్ రెడ్డి సందర్సింపనున్నారు. ఈనెల 15వ తేదీన భద్రాచలం రాములవారిని దర్శించుకుని, పురుషోత్తమ పట్టణంలోని రాముల వారి గోషాలను సందర్శించనున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎటపాక మండలం, పురుషోత్తమ పట్టణంలోని రాముల వారి భూములు అన్యాక్రాంతం అవుతున్న సందర్భంలో ఈ విషయాన్ని విశ్వహిందూ పరిషత్ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతి హిందువును చైతన్యం చేస్తూ రాముల వారి భూములను, దేవుడి అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వహిందూ పరిషత్ సంకల్పించింది. 
 
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు అతీతంగా యావత్ హిందూ సమాజాన్ని జాగృతం చేస్తూ రాములవారి భూములను కాపాడే బాధ్యత విశ్వహిందూ పరిషత్ భుజానికి ఎత్తుకుంది. అంగుళం భూమి కూడా వదిలేందుకు సిద్ధంగా లేమని గతంలోనే పరిషత్ రాష్ట్ర బృందం తేల్చి చెప్పింది.
 
5వ తేదీన రాముల వారి గోషాలను సందర్శించాక, సీతారామచంద్ర స్వామి భూముల రక్షణకు పరిషత్ ప్రత్యేక ఉద్యమం చేపడుతుంది. ఇందులో భాగంగానే మంగళవారం సురేందర్ రెడ్డి భద్రాచలంలో పర్యటించనున్నట్లు పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తెలిపారు.