మైసూర్ లో రిటైర్డ్ ఐబి అధికారి కులకర్ణి దారుణ హత్య

 
జిహాదీ కార్యకలాపాలపై మూడు గ్రంధాలు రాసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో రిటైర్డ్ అధికారి ఆర్ ఎన్ కులకర్ణి (83) దారుణ హత్యకు గురయ్యారు. మైసూర్ లోని  మానస గంగోత్రి ప్రాంతంలో  నవంబర్ 4 సాయంత్రం 5.30 కి నడక కోసం వచ్చిన ఆయనను కారుతో గుద్ది చంపారు. ఏదో  రోడ్ ప్రమాదం జరిగిందనే \ ఫిర్యాదుపై అక్కడకు చేరుకున్న పోలీసులకు  తీవ్రంగా గాయపడి రోడ్డుకి పక్కగా ఉన్న గడ్డిలో పడి ఉండటం చూసారు.
 మైసూరు లోని ఓ ఆసుపత్రిలో చేర్చగా గా వృద్ధాప్యం వలన తీవ్ర గాయాలకు తట్టుకోలేక ఆయన మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ముందు పోలీసులతో సహా అందరూ ప్రమాదవశాత్తూ కారు లాంటిది ఏదో గుద్ది వెళ్ళిపోయి ఉంటుంది అనుకోని మొదట హిట్ అండ్ రన్ కేసుగా భావించారు.
కానీ ఘటన జరిగిన మైసూరు లోని మానస గంగోత్రి ప్రాంతము లో ఉన్న సిసిటివి ఫుటేజ్ లను పరిశీలించగా అది హత్యాగా గుర్తించారు.  సాయంత్రం నడక కోసం వచ్చిన కులకర్ణి అంతగా జన సంచారం లేని మైసూరు యూనివర్సిటీ కాంపస్ లోని మానస గంగోత్రి కాలనీలో హత్యకి గురయ్యారు.
నంబర్ ప్లేట్ లేని కారు ఒకటి రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న కులకర్ణి  మీదకి కావాలనే వచ్చి గుద్దేశి వెళ్లిపోయినట్లు సిసిటివిలో నమోదయింది.  దాంతో పోలీసులు పధకం ప్రకారం జరిపిన హత్యగా మైసూరులోని జయలక్ష్మి పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ను నమోదు  చేశారు.
మైసూరు పోలీస్ కమీషనర్ చంద్ర గుప్త మాట్లాడుతూ మొదట హిట్ అండ్ రన్ కేసుగా భావించామని,  తరువాత సిసిటివి ఫుటేజ్ చూశాక దానిని ప్రీ ప్లాన్డ్ మర్డర్ కేసుగా రిజిస్టర్ చేశామని తెలిపారు.  అసిస్టంట్ పోలీస్ కమీషనర్ నేతృత్వంలో మూడు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.
కారు నంబర్ ప్లేట్ లేకుండా ఉండడం వలన కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ, ఇప్పటికే తమ దర్యాప్తు బృందానికి కొన్ని లీడ్స్ దొరికాయని చెప్తూ వాటిని ఇప్పటికిప్పుడే బయటికి చెప్పలేమని   చెప్పారు.  మొత్తం కేసు దర్యాప్తు అయిపోయి హంతకులని పట్టుకున్నాక వివరంగా చెప్తామని పేర్కొన్నారు.
 కులకర్ణి  కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో లో పని చేసి 2000లో పదవీ విరమణ చేశారు.  తన రిటైర్మెంట్ తరువాత ”  ….. అండ్ ఎట్ గాడ్ స్మైల్స్’
అనే పుస్తకం వ్రాసారు. ఈ పుస్తకంలో ఒక కుటుంబంలోని అయిదు తరాల వారి జీవన శైలి తో పాటు అలవాట్లు, వారి పద్ధతులని ఆసక్తికరంగా నవల రూపంలో వ్రాసారు. 
 
`సిన్ అఫ్ నేషనల్ కాంసైన్సు’  అనే రెండో పుస్తకంలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేషన్స్ మీద ఆసక్తి కలిగించే విధంగా నిజ అనుభవాలని ఉటంకిస్తూ వ్రాసారు. ఈ పుస్తకం చాలామంది ని ఆకర్షించింది. చర్చలకి తెర తీసింది.
`ఫాసెట్స్ అఫ్ టెర్రరిజం ఇన్ ఇండియా’ అనే మూడవ పుస్తకం పలు సంచలన వాస్తవాలను బయటపెట్టింది. భారత దేశంలో ఉగ్రవాదం తాలూకు బహు ముఖాలని వెల్లడించింది. ముఖ్యంగా జిహాద్ మీద ఆయన వ్రాసిన కొన్ని సంఘటనలు మనల్ని విస్తుపోయేలా చేస్తాయి. ఈ పుస్తకం ప్రధానంగా రెండు విషయాల మీద చర్చిస్తుంది.
 
ఒకటి రెడ్ కారిడార్, రెండవది జిహాద్. ప్రస్తుతం మన దేశం ఈ రెండు విషయాల మీద పోరాడాల్సి వస్తున్నది అంటూ వివరంగా రాసుకొచ్చారు. రెడ్ కారిడార్ అంటే కమ్యూనిస్ట్ ప్రభావం కల మన వ్యవస్థ ఎలా మన దేశాన్ని నడుపుతున్నదీ వివరంగా తెలియజేశారు. రెండవది జిహాద్ ని ఎలా, ఎవరు ఎక్కడ ప్రోమోట్ చేస్తున్నారో వివరంగా వ్రాసారు. 
 
మూడవ పుస్తకం సంచలనకు దారితీసింది. వ్రాసింది ఒక మాజీ కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారం కావడం, కొన్ని నిజ సంఘటనలను వ్రాయడంతో విశేషమైన చర్చకు దారితీసింది. ఇందులో వెయ్యేళ్ళ దురాక్రమణదారుల నిజ చరిత్రని ప్రస్తావించారు కులకర్ణి. చరిత్ర కారులు మన పూర్వ చరిత్రని ఏ సందర్భంలో, ఎలా వక్రీకరించి వ్రాసారో ఆధారాలతో సహా వివరించారు తన పుస్తకంలో.
83 ఏళ్ల వయో వృద్ధిడిని కులకర్ణి ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ?  జిహాద్ మీద పుస్తకం వ్రాసినందుకా ? లేక ఆస్తుల విషయంలో హత్య జరిగిందా ? అయితే పోలీసులు ఆస్తి వివాదంలో హత్య జరిగి ఉండవచ్చు అని చూచాయగా చెప్తున్నారు. కానీ అసలు హంతకులని తప్పు దోవ పట్టించడానికి కులకర్ణి హత్యని ఆస్తి తగాదా హత్యాగా ప్రకటించి ఉండవచ్చు. దీని వల్ల హంతకులు నిర్భయంగా ఉంటారు, దొరికిపోతారు అనే వ్యూహం కూడా ఉండి ఉండవచ్చు!
ఏదైనా సరే నిత్యం ప్రశాంతంగా ఉండే మైసూరు లాంటి నగరంలో ఒక మాజీ ఇంటెలిజెన్స్ అధికారి హత్య జరగడం విచారకం! పదవీ విరమణ అనంతరం ప్రశాంతంగా ఉండే మైసూరు నగరంలో ప్రశాంతంగా జీవితం గడపాలి అని అనుకునే వారిలో ఉత్తరాదికి చెందిన విశ్రాంత అధికారులు కూడా ఉన్నారు.