డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్ ఎన్నికలు

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌నుకేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌  ప్రకటించారు. రెండు ద‌శ‌ల్లో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ 1న తొలి ద‌ఫా, అయిద‌వ తేదీన రెండో ద‌ఫా ఎన్నిక‌లను నిర్వ‌హించ‌నున్నారు.  డిసెంబ‌ర్ 8వ తేదీన ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

తొలి విడుత‌లో 89 స్థానాల‌కు, రెండ‌వ విడుత‌లో 93 స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. గుజ‌రాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.  జ‌న‌ర‌ల్ 142, ఎస్టీ 13, ఎస్సీ 27 స్థానాలు ఉన్న‌ట్లు సీఈసీ వెల్ల‌డించారు. 51,782 పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేశామ‌ని పేర్కొన్నారు. అర్బ‌న్ ప్రాంతాల్లో 17506, రూర‌ల్ ఏరియాలో 34276 పోలింగ్ బూత్‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. 182 మోడ‌ల్ పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో మొత్తం ఓట‌ర్ల సంఖ్య 4,90,89765. దీంట్లో తొలిసారి 4,61,494 మంది ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.   2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ99 , కాంగ్రెస్  77 స్థానాలను దక్కించుకున్నాయి.  ఆ సమయంలో బీజేపీ వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చింది. ఈ సారి కాంగ్రెస్‌, ఆప్‌, బిజెపి మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు త‌ప్ప‌దు. గుజ‌రాత్ అసెంబ్లీ ఫిబ్ర‌వ‌రి 18, 2023లో ముగియ‌నున్న‌ది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ ఎన్నిక‌ల‌కు ప్ర‌త్యేక అబ్జ‌ర్వ‌ర్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్ల‌డించారు. మ‌హిళ‌లు, వృద్ధులపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌నుని తెలిపారు. 4.90 కోట్ల మంది ఓట‌ర్ల‌లో పురుషులు 2.53 కోట్లు, మ‌హిళ‌లు 2.37 కోట్లు, మూడ‌వ జెండ‌ర్‌కు చెందిన 1,417 మంది ఓట‌ర్లు ఉన్నారు.

ప్రతిపక్షాల ఆరోపణలు కొట్టిపారవేత 

ఎన్నికల తేదీలు  ప్రకటించడంలో కమీషన్ జాప్యం చేసిన్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను రాజీవ్ కుమార్ కొట్టిపారవేశారు. తేదీలను ప్రకటించే సమయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవలసి ఉంటుందని చెప్పారు. వాతావరణ పరిస్థితులు, అసెంబ్లీ కాలపరిమితి, ప్రవర్తన నియమావళి అమలులో ఉండే సమయం వంటి అంశాలను ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. 

ఈ విషయంలో కమీషన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ మాటలకన్నా చేతలు వాస్తవాలను వెల్లడిచేస్తాయని స్పష్టం చేశారు. “మీకు అర్ధం చేసుకొనేటట్లు చేయడం కోసం నేను ఎన్ని మాటలు చెప్పినా మేము తీసుకొనే చర్యలు, సరైన ఫలితాలు ముఖ్యం. విమర్శలు చేసినవారు ఆశ్చర్యకర ఫలితాలు పొందుతున్నట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి” అని ఆయన గుర్తు చేశారు. 

ప్రధాని మోదీ గుజరాత్ లలో  పర్యటిస్తున్న కారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలో జాప్యం చేశారనే విమర్శలను ప్రస్తావిస్తూ “మొన్న మొర్బి వంతెన కూలిపోయిన దురదృష్టకర సంఘటన జరిగింది. నిన్న గుజరాత్ సంతాప దినం పాటించింది. కాబట్టి పలు కారణాలు ఉన్నాయి” అని రాజీవ్ కుమార్ చెప్పారు.