బ్రెజిల్‌ నూతన అధ్యక్షుడిగా వామపక్ష నేత లూలా డా సిల్వా

బ్రెజిల్‌ అధ్యక్ష పదవిని వరుసగా మూడోసారి చేపట్టాలని భావించిన జైర్‌ బోల్సనారోకు చుక్కెదురయింది. లెఫ్టిస్ట్‌ వర్కర్స్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ అధ్యక్షుడు లూయిజ్‌ ఇన్‌సియో లులా డా సిల్వా  స్వల్ప ఆధిక్యతతో కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 77 ఏండ్ల డా సిల్వా  51 శాతం ఓట్లతో బోల్సనారోపై విజయం సాధించారు.

దీంతో ఆయన మరోసారి అధ్యక్షుడిగా బాధ్యలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో బోల్సనారోకి 49 శాతం (5,82,05,917) ఓట్లు లభించాయి.బ్రెజిల్‌ చరిత్రలో అత్యంత ప్రజాధరణ పొందిన అధ్యక్షుడిగా డా సిల్వా పేరొందారు. అయితే వివాదాస్పదమైన అవినీతి ఆరోపణలతో 2010లో అధ్యక్ష పదవినుంచి తప్పుకున్నారు.

అనంతరం 18 నెలల పాటు జైలుశిక్ష అనుభవించాడు. 1970వ దశకంలో బ్రెజిల్‌లోని మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన డా సిల్వా.. దేశ 35వ అధ్యక్షుడిగా 2003 నుంచి 2010 వరకు పనిచేశారు.

బ్రెజిల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం మోసంతో కూడుకున్నదని,  న్యాయస్థానాలు, మీడియా,  ఇతర సంస్థలు తమ తీవ్రవాదానికి వ్యతిరేకంగా కుట్ర చేశాయని తగు ఆధారాలు లేకుండా నెలల తరబడి ఆరోపిస్తున్న  బోల్సోనారో, అతని మద్దతుదారులు ఫలితాలపై ఎలా స్పందిస్తారనే దానిపై ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. 

1964-1985 సైనిక నియంతృత్వం ముగిసి,  బ్రెజిల్ ప్రజాస్వామ్యంలోకి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ ఎన్నికల్లో గెలవని మొదటి ప్రస్తుత అధ్యక్షుడు బోల్సనారో అయ్యారు.