ముడి ఉక్కు ఉత్పత్తి సామర్ధాన్ని రెట్టింపు చేసే లక్ష్యం 

దేశంలో ముడి ఉక్కు ఉత్పత్తి సామర్ధాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.  మనం ప్రస్తుతం 154 మీట్రిక్ టన్నుల ముడి ఉక్కు ను ఉత్పత్తి చేస్తున్నామని చెబుతూ, తదుపరి తొమ్మిది, పది సంవత్సరాల లో 300 ఎమ్ టి ఉత్పత్తి సామర్థ్యాన్ని సంపాదించుకోవాలన్నది మన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

గుజరాత్‌లోని హజీరాలో ‘అర్సెలర్‌ మిట్టల్ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా’ (ఎంఎ/ఎన్‌ఎస్‌- ఇండియా) ప్లాంటు విస్తరణను  ప్రధానిమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రారంభిస్తూ ఉక్కు కర్మాగారం ద్వారా పెట్టుబడులు రావడంతో పాటు అనేక కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకుంటున్నాయని చెప్పారు.

“రూ.60వేల కోట్లకు పైగా పెట్టుబడితో గుజరాత్ సహా దేశవ్యాప్తంగా అనేక ఉద్యోగ అవకాశాల సృష్టికి వీలు కలుగుతుంది. ఈ విస్తరణ తర్వాత హజీరా స్టీల్ ప్లాంట్‌లో ముడి ఉక్కు ఉత్పాదక సామర్థ్యం 9 మిలియన్ టన్నుల నుంచి 15 మిలియన్ టన్నులకు పెరుగుతుంది” అని ఆయన తెలిపారు.

భారత్‌ 2047నాటికి ప్రగతిశీల దేశంగా ఆవిర్భవించడంలో ఉక్కు పరిశ్రమ రంగం పాత్ర పెరుగుతుందని ప్రధాని తెలిపారు.  బలమైన ఉక్కు రంగంతో బలమైన మౌలిక సదుపాయాలకు బాటలు పడతాయని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, నిర్మాణ రంగం, ఆటోమోటివ్, మూలధన వస్తూత్పత్తి,  ఇంజనీరింగ్ ఉత్పత్తుల రంగాలకు ఉక్కు రంగం ప్రధాన పాత్ర పోషిస్తుందని వివరించారు. 

ఈ ప్లాంటు విస్తరణతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోమొబైల్, ఇతర ఉత్పాదక రంగాల్లో భారీ తోడ్పాటు దిశగా మన దేశానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో వస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. విమాన వాహక నౌకలలో ఉపయోగించేటటువంటి ప్రత్యేకమైన ఉక్కు ను డిఆర్ డిఒ కు చెందిన శాస్త్రవేత్త లు అభివృద్ధిపరచారని ప్రధాన మంత్రి తెలిపారు.

‘‘గత ఎనిమిది సంవత్సరాలుగా అందరి ప్రయత్నాల వల్ల భారతదేశం  ఉక్కు పరిశ్రమ ప్రపంచంలో ఉక్కును ఉత్పత్తి చేస్తున్న రెండో అతి పెద్ద పరిశ్రమగా ఆవిర్భవించింది. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అపారమైన సంభావ్యత ఉంది’’ అని కూడా ఆయన పేర్కొన్నారు.

అభివృద్ధి తాలూకు దృష్టికోణం ఆచరణ రూపాన్ని సంతరించుకొంటూ ఉంటుందో, అప్పుడు ఎదురుపడేటటువంటి సవాళ్లను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఉక్కు పరిశ్రమ నుండి వెలువడే కర్బన ఉద్గారాల తాలూకు ఉదాహరణను ప్రస్తావించారు. భారతదేశం ఒక వైపు నుండి ముడి ఉక్కు ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని విస్తరించుకొంటూనే మరి మరో వైపు నుండి పర్యావరణ మిత్రపూర్వకంగా ఉండేటటువంటి సాంకేతిక పరిజ్ఞ‌ానాన్ని ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన వివరించారు. 

‘‘ప్రస్తుతం, భారతదేశం కర్బన ఉద్గారాలను తగ్గించే కోవకు చెందిన ఉత్పత్తి సంబంధి సాంకేతిక విజ్ఞ‌ానాన్ని అభివృద్ధిపరచడంపై శ్రద్ధ తీసుకోవడంతో పాటు గా కర్బనాన్ని వెలికి తీసి,  దానిని రెండో సారి ఉపయోగించడానికి సైతం ప్రాధాన్యాన్ని ఇస్తుంది’’ అని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘ఎఎమ్ఎన్ఎస్ ఇండియా గ్రూపునకు చెందిన హజీరా ప్రాజెక్టు కూడాను హరిత సాంకేతిక పరిజ్ఞ‌ానాన్ని ఉపయోగించడం పట్ల అమిత ప్రాముఖ్యాన్ని ఇస్తుండడం అనేది నాకు సంతోషాన్ని కలిగిస్తోంది’’ అని ప్రధాన మంత్రి చెప్పారు.